OTT Releases: గత 4-5 ఏళ్ల నుంచి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఓటీటీకు ఆదరణ పెరిగింది. అందుకే ధియేటర్లతో సమానంగా కొత్త సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అంతేకాకుండా ఓటీటీల్లో వివిధ భాషల్లో వెబ్‌సిరీస్‌లు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం పెద్దగా భారీ బడ్జెట్ సినిమాలు లేకపోయినా ఓ మాదిరి సినిమాలు మాత్రం చాలానే ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నచ్చిన సమయంలో, నచ్చిన భాషలో, నచ్చినట్టుగా చూసేందుకు వీలుండటంతో గత కొద్దికాలంగా ఓటీటీ వేదికలకు డిమాండా్ పెరుగుతోంది. అందుకే ప్రతి సినిమా థియేటర్‌తో పాటు ఓటీటీల్లో కూడా విడుదలవుతోంది. ప్రతి వారం విడుదలైనట్టే ఈ వారం కూడా సినిమాలున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు లేకపోయినా ఒకట్రెండు చెప్పుకోదగ సినిమాలున్నాయి. ముఖ్యంగా ఫహద్ ఫాజిల్ నటించిన మళయాలం బ్లాక్‌బస్టర్ సినిమా ఆవేశం ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు సత్యదేవ్ నటించిన సినిమా కూడా ఫరవాలేదు. 


నెట్‌ఫ్లిక్స్‌లో..


మే 6వ తేదీన దో రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ ఇంగ్లీషు సినిమా,  మే 9న మదర్ ఆఫ్ ద బ్రైడ్ ఇంగ్లీషు సినిమా, బోడ్కిన్ ఇంగ్లీషు సినిమా, ధ్యాంక్యూ నెక్స్ట్ టర్కిష్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా మే 10న లివింగ్ విత్ లియోపార్డ్స్ మే 10 విడుదల కానుంది.


అమెజాన్ ప్రైమ్‌లో..


అమెజాన్ ప్రైమ్‌లో ఈ వారంలో అంటే మే 9వ తేదీన మలయాళం బ్లాక్‌బస్టర్ తెలుగు డబ్బింగ్ సినిమా ఆవేశం స్ట్రీమింగ్ కానుంది. మే 9వ తేదీనే మరో రెండు వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ద గోట్ ఇంగ్లీషు వెబ్‌సిరీస్, మ్యాక్స్ టన్ హాల్ జర్మన్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.


ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఆల్ ఆఫ్ అజ్ ఇంగ్లీషు సినిమా మే 8న స్ట్రీమింగ్ కానుంది. ఇక జీ5లో మే 10న 8ఏఎం హిందీ సినిమా, మే 10వ తేదీన పాష్ బాలిష్ బెంగాలీ వెబ్‌సిరీస్ ప్లే కానున్నాయి. సోనీలివ్‌లో మే 10 నుంచి ఉందేకి సీజన్ 5 వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. జియో సినిమాలో రోజూ ప్రసారమయ్యే ఐపీఎల్ 2024 మ్యాచ్‌లకు తోడుగా కొత్తగా మర్డర్ ఇన్ మహిమ్ హిందీ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇక లయన్స్ గేట్ ప్లేలో మే 10న ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ ద మార్ష్ కింగ్స్ డాటర్ స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. సన్‌నెక్స్ట్‌లో తమిళ వెబ్‌సిరీస్ ఫ్యూచర్ పొండాటి స్ట్రీమింగ్ కానుంది.


Also read: Rain Alert: ఎండల్నించి ఉపశమనం, ఇవాళ, ఎల్లుండి రాష్ట్రంలో వర్షసూచన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook