Allu Arjun: విచారణలో అల్లు అర్జున్ కి ఎదురైనా ఊహించని 14 ప్రశ్నలు.. ఏంటంటే.?
Questions to Allu Arjun by Police : సంధ్య థియేటర్ ఘటన అందర్నీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇందుకు ముఖ్య కారణం ఈ ఘటన వల్ల.. అల్లు అర్జున్ ప్రస్తుతం.. ఎన్నో సమస్యలు ఎదుర్కొతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ను విచారణకు రావాలని తెలపగా.. నేడు బన్నీ హాజరయ్యారు. అందులో భాగంగానే పలు ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ ప్రశ్నలు ఏమిటంటే..
Questions to Allu Arjun by Police: సంధ్య థియేటర్ సంఘటనలో భాగంగా పోలీసులు ఈ రోజు అల్లు అర్జున్ ని విచారిస్తున్నారు. అందులో భాగంగా ఊహించని ప్రశ్నలు అల్లు అర్జున్ కు ఎదురయ్యాయి. ముఖ్యంగా వీడియోలు చూపించి మరీ.. ప్రశ్నలు అడగడంతో అల్లు అర్జున్ సైలెంట్ అయినట్లు సమాచారం.
మరి అల్లు అర్జున్ ను అడిగిన ప్రశ్నలేంటో ఇప్పుడు చూద్దాం.
1. సంధ్య థియేటర్ కి వచ్చే ముందు మీరు ఎవరి పర్మిషన్ తీసుకున్నారు?
2. పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ముందుగా ఎవరు తెలియజేశారు?
3. పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు తెలియజేశారు, లేదా?
4. మీరు థియేటర్లో ఉండగా రేవతి మరణం గురించి మీకు ముందే తెలుసా.?
5. దాని గురించి మీకు సమాచారం ఇవ్వలేదని ఎందుకు మీరు మీడియాకు అబద్ధం చెప్పారు?
6. మీరు రోడ్డు షో కోసం ఎవరి అనుమతి పొందారు?
7. అనుమతి లేకుండా రోడ్డు షో ఎలా నిర్వహించారు?
8. మీతో పాటు థియేటర్ కి వచ్చిన మీ కుటుంబ సభ్యులు ఎవరు?
9. మీరు ఎంతమంది బౌన్సర్లను నియమించుకున్నారు?
10. అభిమానులు మరియు పోలీసు సిబ్బంది పై దాడి చేసిన మీ బౌన్సర్లు ఎవరెవరు?
11. అభిమానులు మరియు పోలీసు సిబ్బందిపై దాడి చేసిన ఆ బౌన్సర్లు ఎవరు?
12. మహిళా మరణం గురించి తెలుసుకున్న పోలీసులు థియేటర్ నుండి మిమ్మల్ని బయటకు వెళ్ళమని అడిగారా?
13. పోలీసులు మిమ్మల్ని వెళ్ళమని అడిగితే మీరు ఎందుకు నిరాకరించారు?
14. రేవతి మరణం గురించి మీకు మొదట ఎప్పుడు ఏ సమయంలో తెలిసింది?
ఇలా ఇన్ని ప్రశ్నలతో రెండు మూడు గంటల పాటు.. ప్రశ్నోత్తరాలు సాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది సాయంత్రం వరకు కొనసాగితే మధ్యలో మధ్యాహ్నం భోజనం విరామం కూడా ఉండవచ్చు.
ఏది ఏమైనా అల్లు అర్జున్ ను విచారిస్తున్న తీరుకు ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అన్నిటికీ అల్లు అర్జున్ ఏ విధంగా సమాధానం చెబుతారో చూడాలి . అంతేకాదు ఈ విచారణకు సంబంధించిన పూర్తి వీడియోగ్రఫీ కూడా బయటకి త్వరలో వదలనున్నట్లు సమాచారం.
Read more: Allu Arjun Police Station: పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్.. ప్రశ్నలతో బన్ని ఉక్కిరి బిక్కిరి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.