Radhe Shyam: రాధే శ్యామ్ నుంచి వాలెంటైన్స్ గిఫ్ట్- ప్రభాస్, పూజాల లుక్స్ అదుర్స్!
Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్జేలు హీరో, హీరోయిన్లుగా నటించిన రాధే శ్యామ్ సినిమా నుంచి గిఫ్ట్ వచ్చింది. వాలెంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ గ్లిమ్స్ విడుదల చేసింది చిత్ర యూనిట్.
Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‌కు వాలెంటైన్ డే గిఫ్ట్ ఇచ్చింది 'రాధే శ్యామ్' చిత్ర బృందం. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది.
ప్రభాస్ (విక్రమాదిత్య), పూజా హెగ్జే (ప్రేరణ)ల మధ్య లవ్ సీన్స్‌తో కూడీన ఈ స్పెషల్ ట్రైలర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రేరణను లవ్‌లో పడేసేందుకు విక్రమాదిత్య చేసే పనులు.. హీరో ప్రభాస్ మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేసే సీన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
కరోనా మూడో దశ కారణంగా జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. దీనితో నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు నిజంగా ఈ ట్రైలర్ పెద్ద గిఫ్ట్ అనే చెప్పాలి. వాలెంటైన్స్ డే స్పెషల్ గ్లిమ్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
ఇక ఈ వీడియోలోని కొన్ని స్పెషల్ విషయాలు..
1970ల కాలం నాటి లుక్స్ చాలా బాగున్నాయి. 'కుక్ చేస్తావ్.. బాగా మాట్లాడతావ్.. ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లెందుకు కాలేదు?' అని పూజా హెగ్డే ప్రభాస్ గురించి చెప్పే డైలాగ్ ఇందులో హైలైట్ అని చెప్పొచ్చు.
రాధే శ్యామ్ గుగించి..
ఈ సినిమా మార్చి 11న ప్రపంచపవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
రాధా కృష్ణ కుమార్ ఈ సినిమాకు స్టోరీ, దర్శకత్వం వహించారు. టీ సిరీస్ ఫిలింస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. భూషన్ కుమార్, వంశి, ప్రమోద్, ప్రసిద్ధ ప్రొడ్యూసర్లు.
నటీ నటులు..
భాగ్య శ్రీ, కృష్ణం రాజు, సత్య రాజ్, జగపతి బాబు, సచిన్ కేదార్కర్, ప్రియదర్శి, మురళి శర్మ, జయరామ్ సహా పలువురు ఈ సినిమాలో నటించారు.
Also read: Gurthunda Seethakalam Trailer: ఆకట్టుకుంటున్న సత్యదేవ్ 'గుర్తుందా శీతాకాలం' ట్రైలర్
Also read: Sree Leela 'Dhamaka' Look: రవితేజ మూవీ నుంచి 'శ్రీలీల' ఫస్ట్ లుక్ రిలీజ్.. ఎలా ఉందంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook