Radhe Shyam Release: డార్లింగ్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. దీంతో అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ కోసం 'రాధేశ్యామ్' దర్శకుడు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశాడు. అందులో 'రాధేశ్యామ్' రిలీజ్ పై స్పష్టత ఇచ్చాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ప్రేమ, సంస్కృతి కలిగిన గొప్ప దేశానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాధేశ్యామ్ మూవీ త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది" అని డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ట్వీట్ చేశాడు. ఇటీవలే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన చిత్రబృందం సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి తగ్గి.. థియేటర్లు తెరుచుకొనే క్రమంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేసింది. 



1970ల నాటి ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్​ చేయాల్సి ఉంది.  కానీ కరోనా ప్రభావం వల్ల అది కాస్త వాయిదా పడింది. అయితే సినిమాను మార్చి 18న థియేటర్లలోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది చూడాలి.


ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా నటించింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. 


Also Read: Breaking News: మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్.. స్వల్ప లక్షణాలతో క్వారంటైన్


Also Read: Raviteja Birthday: మాస్ సామ్రాజ్యానికి మకుటం లేని రారాజు మన రవితేజ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook