Ashwini Dutt: అశ్వినీ దత్ కు కుల పిచ్చి.. తమిళ నటుడి సంచలన వ్యాఖ్యలు!
Radharavi about Ashwini Dutt: ప్రముఖ సీనియర్ తమిళ నటుడు రాధా రవి మాట్లాడుతూ.. వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్ కు కుల పిచ్చి. ఆ పిచ్చి కారణంగానే ఆయన బ్యానర్లో..నేను ఒప్పుకున్న సినిమాలన్నింటినీ క్యాన్సిల్ చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు రాధా రవి.
Ashwini Dutt Caste: వైజయంతి మూవీస్ బ్యానర్ దాదాపు కొన్ని దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సంస్థ ఇప్పటికీ ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలను నిర్మిస్తూ.. భారీగా ఆర్జిస్తోంది. ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ తో కల్కి 2898 AD సినిమాను తెరకెక్కించి విడుదలైన.. నెల రోజుల్లోనే రూ .1000 కోట్ల క్లబ్లో చేరి రికార్డ్ సృష్టించిందిఈ నిర్మాణ సంస్థ. ఇక ఈ నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్న చలసాని అశ్వినీ దత్ టిడిపి పార్టీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ కి బాగా సన్నిహితుడు. ఇద్దరిదీ ఒకే కులం కావడంతో వీరిద్దరి బ్యానర్ లో ఎన్నో సినిమాలు రావడమే కాదు సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు అశ్వినీ దత్ ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఇక దాదాపు ఐదేళ్ల తర్వాత.. మళ్లీ టిడిపి పార్టీ అధికారంలోకి రావడంతో ఇటీవలే టిక్కెట్లు రేట్లు పెంచి మరొకసారి లాభాలు పొందారు అశ్వినీ దత్.
ఇదిలా ఉండగా ఈయనకు కులపిచ్చి ఎక్కువ అని.. అందుకే తనను కులం చూసి సినిమాలో.. రిజెక్ట్ చేశారని ఒక తమిళ సీనియర్ నటుడు చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ తమిళ సీనియర్ నటుడు రాధా రవి తాజాగా వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్విని దత్ పై పలు సంచలన ఆరోపణలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఒక సినిమాలో నా కులం చూసి అశ్వినీ దత్ నన్ను రిజెక్ట్ చేశాడు అని తెలిపారు రాధా రవి ..1986లో వెంకటేష్ హీరోగా, కుష్బూ హీరోయిన్గా వచ్చిన చిత్రం కలియుగ పాండవులు. ఈ సినిమా షూటింగ్ టైం సమయంలో నేను వైజాగ్ లో ఉన్నాను.. నన్ను తన సినిమాలలో నటించమని బుక్ చేయడానికి అశ్వినీ దత్ వచ్చారు.అప్పుడు నేను అశ్విని దత్ కు ఒకటే మాట చెప్పాను. నాకు తెలుగులో కే. రాఘవేంద్రరావు మాత్రమే తెలుసు. ఆయన ఏం చెబితే అదే ఫైనల్ అని అన్నాను. అయితే నన్ను బుక్ చేయమని అశ్విని దత్ తన అసిస్టెంట్ కి చెప్పాడు. అది చెబుతూ.. మీ క్యాస్ట్ ఏంటి ? అని అడిగాడు. నేను నాకు సరిగ్గా తెలియదు .బలిజ నాయుడు కావచ్చు అని అన్నాను. దాంతో అది విన్న అశ్వినీ దత్ సైలెంట్గా వెళ్ళిపోతూ, తన బ్యానర్ లో ఉన్న నా సినిమాలన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పాడు.
దీనికి కారణం అడిగితే చెప్పకుండా సైలెంట్
గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక ఇదే విషయాన్ని నేను రాఘవేందర్ రావు దగ్గర స్పందిస్తే.. ఆయన అతడికి ఏమైంది? ఎందుకు క్యాన్సిల్ చేశాడు? అని అడిగాడు .. దాంతో నేను నాకు తెలియదు సర్ అని చెప్పాను. చివరిగా నాకు అర్థమైంది ఏమంటే..? నా క్యాస్ట్ ని చూసి ఆయన నన్ను సినిమాల నుంచి తీసేశాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాధా రవి. ఏదీ ఏమైనా అశ్వినీ దత్ కు కులపిచ్చి అని ప్రత్యక్షంగా కామెంట్లు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి