N - convention: సమంత ను మధ్యలోకి లాగారే..అసలు ఏం జరుగుతోంది..?
Samantha: ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతపై..టిఆర్ఎస్ పార్టీ ఎన్ కన్వెన్షన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు రఘునందన్.. అప్పటి కేటీఆర్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. పైగా నాగార్జున మాజీ కోడలు సమంతని తీసుకొచ్చి తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం.. వెనుక ఆంతర్యం ఏమిటి కామెంట్స్ చేసారు.
Samantha - Nagarjuna: హైదరాబాదులోని మాదాపూర్ తుమ్మిడికుంట చెరువుకు ఆనుకొని నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించిన విషయం తెలిసిందే. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ పెద్ద పెద్ద సెలబ్రిటీల ఫంక్షన్లకు వేదిక అయింది. ఇప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ ను అక్రమంగా నిర్మించారని , దాదాపు చెరువు మూడున్నర ఎకరాల భూమిని కబ్జా చేసి నాగార్జున కన్వెన్షన్ నిర్మించారు అంటూ ఆరోపణలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన హైడ్రా వెంటనే కూల్చివేసింది.
ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది . నాగార్జున లాంటి వేలకోట్ల ఆస్తులకు అధిపతి అయిన ఆయన.. కేవలం మూడున్నర ఎకరం కబ్జా చేసాడా అంటూ వార్తలు గుప్పించారు. ముఖ్యంగా సిపిఐ నారాయణ వంటి వారైతే ఏకంగా నాగార్జున నుంచి 10 యేళ్ళ అద్దె వసూలు చేయమని చెప్పి కామెంట్లు చేశారు.
ఇకపోతే దీనిపై స్పందించిన నాగార్జున.. తుమ్మిడికుంట చెరువులో తాను ఎటువంటి భూమి కబ్జా చేయలేదని, పది ఎకరాల భూమి కూడా ప్రైవేటు భూమి అని తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే వెంటనే కూల్చివేయడం ఆపివేయాలని హైకోర్టు స్టే ఇచ్చినా.. అప్పటికే రెండు పెద్ద హాళ్లను ఎన్ కన్వెన్షన్ కూల్చివేసింది.
ఇకపోతే అన్ని తేల్చుకుంటానని నాగార్జున కామెంట్లు చేయగా.. ఈ విషయంలోకి నాగచైతన్య మాజీ భార్య సమంతాను లాగడం చర్చనీయాంశంగా మారింది.అయితే తాజాగా దీనిపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. పదేళ్లపాటు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఎన్ కన్వెన్షన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. నమూనాలు తీసుకొని చెరువు భూమిని గుర్తించాలని 2014లో హైకోర్టు ఆదేశించింది.
అయినా పదేళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారు. అప్పటి కేటీఆర్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పైగా నాగార్జున మాజీ కోడలు సమంతని తీసుకొచ్చి తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికైతే ఈయన ఈ వివాదంలోకి సమంతని కూడా లాగే కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: MLC Kavitha Case: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ to బెయిల్.. పూర్తి వివరాలు ఇవే..!
Also Read: Akbaruddin Owaisi: బుల్లెట్లతో నన్ను కాల్చండి.. నా కాలేజ్‌ను కాదు: అక్బరుద్దీన్ సంచలనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter