Raj Kahani : ఎవరూ తీయడానికి ముందుకు రాకపోవడంతో.. రాజ్ కహానిపై రాజ్ కార్తికేన్
Raj Kahani About Raj Kahani రాజ్ కహాని సినిమాతో రాజ్ కార్తికేన్ తన మల్టీ టాలెంట్‌ను చూపించాడు. రాజ్ కార్తికేన్,చంద్రికా అవస్తి జంటగా నటించిన రాజ్ కహానీ సినిమా ఇప్పుడు థియేటర్లో ఆడుతోంది. ఈ సినిమా సక్సెస్ మీద రాజ్ కహాని స్పందించాడు.
Success of Raj Kahani దర్శకుడు, హీరోగా, నిర్మాత రాజ్ కార్తికేన్ తీసిన రాజ్ కహాని సినిమా మార్చి 24న విడుదలైంది. అమ్మ ప్రేమ, అమ్మాయి ప్రేమను ముడిపెడుతూ తీసిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. భార్గవి క్రియేషన్స్ పతాకంపై రాజ్ కార్తికేన్,చంద్రికా అవస్తి జంటగా నటించిన ఈ మూవీలో సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి వంటివారు నటించారు. నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భాస్కర రాజు, ధార్మికన్ రాజు లు సంయుక్తంగా నిర్మించారు.
సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చగా యస్.యస్.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ మూవీ సక్సెస్ అయిన సందర్భంగా ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాత రమేష్ పుప్పాల,ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసి రెడ్డి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, లయన్ సాయి వెంకట్, తదితరులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చిన్న సినిమా అయినా కథలో మంచి కంటెంట్ ఉంటే ఆ సినిమా బిగ్ హిట్ అవుతుందని ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి అన్నారు. అమ్మ ప్రేమను అమ్మాయి ప్రేమకు ముడిపెడుతూ పక్కా కమర్షియల్ హంగులతో చాలా చక్కగా తెరకెక్కించారని నిర్మాత రమేష్ పుప్పాల అన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా ఈ సినిమా తీశారని ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ అన్నాడు.
మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మహిళా ప్రేక్షకాధారణ లభించడం చాలా హ్యాపీగా ఉందని నిర్మాత లయన్ సాయి వెంకట్ అన్నాడు. ఇది తమ మొదటి చిత్రమని, సాఫ్ట్ వేర్ ఎంప్లాయిని అయినా తాము చాలా కష్టపడి తీశామని చిత్ర నిర్మాతలు భాస్కర రాజు, ధార్మికన్ రాజులు అన్నారు.
అమ్మ ప్రేమను, అమ్మాయి ప్రేమను కలగలపి ఒక మంచి కథ రాసుకొని గత రెండు సంవత్సరాలుగా ఎంతోమంది నిర్మాతలకు ఈ కథను వినిపించడం జరిగిందని, ఎవ్వరూ తీయడానికి ముందుకు రాకపోవడంతో తానే తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ సపోర్ట్ తో స్టార్ట్ చేశానని చిత్ర దర్శకులు, హీరో రాజ్ కార్తికేన్ అన్నాడు. ఆ తరువాత కరోనా రావడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపాడు. ఈ సినిమాను విడుదల చేసే స్థోమత లేకున్నా తాము సొంతంగా రిలీజ్ చేసుకున్నామని పేర్కొన్నాడు. సినిమాను సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్ చెప్పాడు.
Also Read: Dasara Collection : రెండో రోజుకే బ్రేక్ ఈవెన్?.. దసరా మేనియా.. నాని రేంజ్ ఇదే
Also Read: Ameesha Patel Bikini : బికినీలో అమిషా పటేల్.. సీనియర్ భామ భారీ అందాల ప్రదర్శన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook