Raj Kundra's Porn films case latest updates: పోర్న్ ఫిలింస్ నిర్మాణం కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు ముంబై కోర్టు 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది. జూలై 19న రాత్రి పోర్న్ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రాకు మంగ‌ళ‌వారంతో క‌స్ట‌డీ ముగియడంతో పోలీసులు ఆయన్ని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కస్టడీ ముగియడంతో రాజ్ కుంద్రా సైతం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ వాదనల మధ్యే రాజ్ కుంద్రా బెయిల్ పిటిష‌న్‌పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హాట్‌షాట్స్ యాప్‌లో (Hotshots app) 1.2 యూఎస్ మిలియన్ డాలర్లకు 119 అభ్యంతరకరమైన పోర్న్ వీడియోలు (objectional adult videos) అప్‌లోడ్ చేసేందుకు రాజ్ కుంద్రా డీల్ కుదుర్చుకున్నట్టు తమ విచారణలో తేలిందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టుకు తెలిపారు.


Also read : Thimmarusu Movie trailer: ఎన్టీఆర్ మెచ్చిన తిమ్మరుసు ట్రైలర్


ఇదిలావుంటే, ఇదే రాజ్ కుంద్రా కేసులో ముంబై పోలీసులకు చెందిన ప్రాపర్టీ సెల్ విభాగం బాలీవుడ్ నటి శెర్లిన్ చోప్రాకు నోటీసులు జారీచేసిన (Sherlyn Chopra summoned in Raj Kundra pornography case) సంగతి తెలిసిందే.


Also read : Nora Fatehi viral dance video: నారా ఫతేహి డ్యాన్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook