Raj tarun case Malvi Malhotra fires on Lavanya allegations: రాజ్ తరుణ్ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దీనిపై తాజాగా, నటి మాల్వీ మల్హోత్ర సీరియస్ అయ్యింది. తనపై లావణ్య లేనిపోనీ అభాండాలు వేసి బెదిరింపులకు పాల్పడుతుందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. ఆమె బెదిరింపులకు పాల్పడుతుందని కూడా రెచ్చిపోయింది. హీరో రాజ్‌తరుణ్‌ కు, తనకు మధ్య  డేటింగ్‌లో ఉన్నాయంటున్న లావణ్య  చేసిన వ్యాఖ్యలను పూర్తిగా అవాస్తవమన్నారు.  రాజ్‌తరుణ్‌ హీరోగా తెరకెక్కిన 'తిరగబడరసామీ’ చిత్రంలో తాను హీరోయిన్ గా నటించానన్నారు. తనకు రాజ్ తరుణ్ మంచి స్నేహితుడు మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Rajtarun case: రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించిన పోలీసులు..


దీనిపై తాను లావణ్యపై పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. తనకు లావణ్య ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతుందని, బెదిరింపులకు గురిచేస్తుందని కూడా మాల్వీ మల్హోత్ర ఆవేదన వ్యక్తం చేసింది. నేను లావణ్యను ఎప్పుడూ కలవలేదు.. ఆమె ఎవరో కూడా నాకు తెలియదని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు..కేవలం సినిమా పరిచయం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చింది. లావణ్య నా నెంబర్ తీసుకుని నన్ను నా పేరెంట్స్ ని బెదిరించిందని చెప్పుకొచ్చింది. తన  గురించి నా ఫ్యామిలీ గురించి అసభ్యంగా ప్రచారం చేస్తోందని, తన కుటుంబం పరువును బజారున పడేలా లావణ్య ప్రవర్తిస్తుందని  మాల్వీ మల్హోత్ర ఆవేదన వ్యక్తం చేసింది.


మా నాన్న బిజినెస్ చేస్తారని, ఆయనకు హిమాచల్ ప్రదేశ్ సీఎంతో సంబంధం లేదని తెల్చి చెప్పింది. లావణ్యను చంపేస్తాం అనే మాటలో నిజం లేదని చెప్పుకొచ్చింది.అక్రమంగా నా ఫోన్ తో పాటు నా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్రాక్ చేశారని చెప్పింది.  తనపై చేసిన తప్పుడు ఆరోపణలపై ఉమెన్ సేఫ్ట్ వింగ్ డీసీపీకి ఫిర్యాదు చేశానని, లావణ్య పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు మాల్వీ మల్హోత్ర తెలిపింది.


Read more: Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..


ఇదిలా ఉండగా.. రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రతో సన్నిహితంగా ఉంటున్నాడంటూ రాజ్ తరుణ్ గత ప్రేయసి లావణ్య శుక్రవారం వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అతని మీద కేసు కూడా పెట్టింది. ఇక మరోవైపు..లావణ్యపై మండిపడుతూ.. సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై మాల్వీ మల్హోత్ర ఫిర్యాదు చేసింది. లావణ్యను బెదిరించలేదని, ఆమెపై చట్టప్రకారం చర్యలు తీసుకొవాలని పోలీసుల్ని కోరినట్లు మాల్వీ మల్హోత్ర వెల్లడించింది. ఆమెపై పరువు నష్టం దావా కూడా వేస్తానంటూ మాల్వీ మల్హోత్ర వార్నింగ్ ఇచ్చింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి