Purushothamudu: `పురుషోత్తముడు`గా వస్తున్న రాజ్ తరుణ్.. డబ్బింగ్ పనుల్లో బిజీ
Raj Tarun Purushothamudu: `పురుషోత్తముడు`గా ఆడియన్స్‌ను అలరించేందుకు యంగ్ హీరో రాజ్ తరుణ్ సిద్ధమవుతున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Raj Tarun Purushothamudu: శ్రీ శ్రీదేవి ప్రోడుక్షన్స్ బ్యానర్‌లో రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన డైరెక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మూవీ 'పురుషోత్తముడు'. ఈ మూవీ రాజమండ్రిలో వేసిన భారీ సెట్‌లో టాకీ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 22న టైటిల్ రివీల్ పోస్టర్‌ను విడుదల చేశారు. అయోధ్య రామజన్మభూమి ప్రాణప్రతిష్ట రోజు అదే టైమ్‌కు టైటిల్ రివీల్ చేయడం ఆనందంగా ఉందని డైరెక్టర్ రామ్ భీమన చెప్పారు. నిర్మాతలు డా.రమేశ్ తేజావత్, ప్రకాష్ తేజావత్ మాట్లాడుతూ.. భారీ బడ్జెట్‌తో రూపుందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మూవీలో భారీ తారాగణంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ స్వరపరచిన సాంగ్స్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తాయన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించబోతుందని జోస్యం చెప్పారు. తన కెరీర్‌లో పురుషోత్తముడు గొప్ప మూవీ అవుతుందని కెమెరామెన్ పీజీ విందా తెలిపారు. ప్రస్తుతం పురుషోత్తముడు మూవీ డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతోందని మూవీ మేకర్స్ వెల్లడించారు.
నటీనటులు:
రాజ్ తరుణ్, హాసిని సుధీర్ (నూతన పరిచయం), మురళి శర్మ, కౌసల్య, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, ముకేష్ ఖన్నా, రాజా రవీంద్ర, రాజ్ తిరన్ దాస్, అనంత్,
సమీర్, సత్య, ప్రవీణ్, కవిత, విరాన్, సుభాష్, జ్వాల కోటి, రచ్చ రవి, నాగ భైరవ అరుణ్, ముక్తార్ ఖాన్, లక్ష్మణ్, కంచరపాలెం రాజు, హరిశ్చంద్ర.
==> రచన & దర్శకుడు: రామ్ భీమన
==> నిర్మాతలు: DR.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బీవీ నారాయణరాజు (నాని),
==> గేయ రచయితలు: రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, అనంత శ్రీరామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, పూర్ణాచారి
==> ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
==> సంగీత దర్శకుడు: గోపి సుందర్
==> సినిమాటోగ్రఫీ: PG విందా
==> ఫైట్ మాస్టర్ : జీవన్, రాజ్ కుమార్
==> కొరియోగ్రాఫర్: సుభాష్
==> పీఆర్‌ఓ : సురేష్ కొండేటి.
Also Read: Parliament Elections: బర్రెలక్క మరో సంచలనం.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సై?
Also Read: Bharat Ratna: కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న పురస్కారం.. అసలు ఆయన ఎవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook