Anubhavinchu Raja Trailer: ‘ఓరేయ్‌ బుజ్జిగా’, ‘పవర్‌ ప్లే’ చిత్రాల తర్వాత హీరో రాజ్ తరుణ్ నటించిన సరికొత్త చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ఇందులో రాజ్‌తరుణ్‌ పూర్వీకుల ఆస్తులను దుబారాగా ఖర్చు పెట్టే యువకుడిగా కనిపించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘‘రూపాయి పాపాయిలాంటిదిరా. దాన్ని పెంచి పెద్దచేసుకోవాలి కానీ.. ఎవరి చేతిలో పడితే వాడి చేతిలో పెట్టకూడదు’’ అనే మాటలతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. ‘‘బంగారంగాడి మనసు సినిమా హాలు లాంటిది. వారానికి ఒక సినిమా వస్తుంటుంది. పోతుంటుంది. ఏదీ పర్మినెంట్‌గా ఆడదు ఇక్కడ’’ అంటూ రాజ్‌ తరుణ్‌.. అరియానాతో చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఇందులో రాజ్‌ తరుణ్‌కు జోడీగా కాషిశ్‌ ఖాన్‌ సందడి చేయనున్నారు. గోపీ సుందర్‌ స్వరాలు అందించారు. నవంబరు 26న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. 



 


Also Read: Karnataka Ratna Award 2021: మరణాంతరం పునీత్ కు అరుదైన గౌరవం.. ‘కర్ణాటక రత్న’ అవార్డుకు ఎంపిక చేసిన రాష్ట్రప్రభుత్వం


Also Read: Romantic Movie: ఓటీటీలోకి 'రొమాంటిక్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే... 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook