RRR Pre Release Event: దర్శకధీరుడు రాజమౌళి (Director Rajamouli) తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నిన్న చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని (RRR Pre Release Event) ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత ధాను, నటుడు, నిర్మాత ఉదయనిధి, హీరో శివకార్తికేయన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి తన ఇద్దరు హీరోలు గురించి మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"నాకంటే తానే సీనియర్‌ అని తారక్‌ (Jr NTR) ఎప్పుడూ గొడవపడుతుంటాడు. చరణ్‌ (Ram Charan) చెప్పినట్టు తారక్‌ది చైల్డ్‌ మెంటాలిటీ, లయన్‌ పర్సనాలిటీ. తారక్‌ ప్రేమను తట్టుకోవటం చాలా కష్టం. టైమ్‌ సెన్స్‌ లేదని తననెప్పుడూ తిడుతూనే ఉంటా. ఎందుకంటే 7గంటలకు సెట్‌కు రమ్మంటే 6 గంటలకే వచ్చేస్తాడు. నా ఆలోచలకు అనుగుణంగా నటిస్తాడు. ఇలాంటి నటుడు దొరకటం భారతీయ చలన చిత్ర పరిశ్రమ చేసుకున్న అదృష్టం'' అని ఎన్టీఆర్ గురించి చెప్పకొచ్చాడు రాజమౌళి. 


Also Read: Rajamouli Mahabharatam: రాజమౌళి డ్రీమ్​ప్రాజెక్ట్ 'మహాభారతం'లో ఆ ఇద్దరి హీరోలు ఫిక్స్!


'చరణ్‌ను 'మై హీరో' అంటుంటా. ఎలాంటి ఒత్తిడి లేకుండా క్లియర్‌ మైండ్‌తో సెట్‌కు వస్తాడు. ఇలాంటి మెంటాలిటీని నేను ఎవరిలోనూ చూడలేదు' అని రాజమౌళి అన్నారు. అంతేకాకుండా''చరణ్‌, తారక్‌.. ఓ స్థాయికి వెళ్లాలనుకుంటున్నారు. కానీ, ఇద్దరి ప్రయాణం వేరు. ఒకరు దక్షిణ ధ్రువం అయితే మరొకరిదిఉత్తర ధ్రువం. ఈ రెండు ధ్రువాలు 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR Movie) అనే అయస్కాంతానికి అతుక్కునందుకు నేనెంతో ఆనందిస్తున్నా.'' అని అన్నారు జక్కన్న.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook