Hollywood Directors for SSMB29: మొన్న సంక్రాంతికి మహేష్ బాబు ,త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం చిత్రం కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించుకున్న.. మహేష్ ఫ్యాన్స్ ని మాత్రం పూర్తిస్థాయిలో సంతృప్తి పరచలేక పోయింది. దీంతో వాళ్లు తమ ఆశలన్నీ జక్కన్న కాంబోలో రాబోతున్న మహేష్ చిత్రం పై పెట్టుకున్నారు. రాజమౌళి సినిమాలంటే ఎంత భారీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి చేసేది సూపర్ స్టార్ మహేష్ బాబుతో అయితే ఆ మూవీ మరింత గ్రాండ్ గా ఉంటుందో అన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హాలీవుడ్ రేంజ్ యాక్టర్ .. ఆస్కార్ రేంజ్ డైరెక్టర్ కలయికలో రాబోతున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.


ఆర్ఆర్ఆర్ మూవీ సమయంలో జక్కన్న ఇద్దరు హీరోల తో కలసి ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ ని నిర్వహించే మూవీ కి సంబంధించిన వివరాలను తెలియపరచారు. ఆ సమయంలో డైరెక్టర్, హీరోలు మీడియాతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ అని కూడా నిర్వహించారు. అయితే ఈసారి రాబోయే మహేష్ చిత్రం కోసం.. మరింత గ్రాండ్ లెవెల్ లో జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్.


ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం రాజమౌళి విపరీతంగా ఆరాధించే స్టీవెన్ స్పీల్బర్గ్ , అవతార్ సృష్టికర్త జేమ్స్ క్యామరూన్ లను ఈ వేడుకకు అతిధులుగా తీసుకువచ్చే అవకాశం ఉందట. ఇద్దరూ ఒకేసారి రావడం కుదరకపోతే.. కనీసం వారిలో ఒకరినైనా ఈవెంట్ కు తీసుకురావాలని జక్కన్న ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. జక్కన్న తలపెట్టిన ఈ పని పూర్తి చేయడానికి ఎస్ఎస్ కార్తికేయ ఆల్రెడీ రంగంలోకి దిగాడని వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ పై విపరీతంగా క్రేజ్ ఉన్న ఈ డైరెక్టర్స్.. జక్కన్న, మహేష్ బాబు మూవీ ఈవెంట్ కు వస్తె.. ప్రారంభానికి ముందే ఈ చిత్రంకు దేశ విదేశాల్లో కవరేజీ మోత మోగిపోతుంది.


అయితే ఇంకా ఈ విషయాలపై ఎటువంటి అధికారిక స్పష్టత లేదు. అయితే మరోపక్క నిప్పు లేనిదే పొగ ఎలా వస్తుంది.. ఏదో మతలబు లేకుండా ఇలాంటి వార్త బయటకు రాదు కదా అన్న అభిప్రాయాలు కూడా ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణ సంస్థ దుర్గ అయినప్పటికీ ఇందులో కొన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా భాగస్వాములుగా ఉంటాయి అని టాక్. ప్రముఖ ఆన్లైన్ దగ్గర సంస్థ కూడా ఇందులో ఒకటి అన్న ప్రచారం జరుగుతోంది. క్యాస్టింగ్ కి సంబంధించిన  సెలక్షన్స్ విషయంలో కూడా రాజమౌళి ఎటువంటి లీకులకు ఆస్కారం లేకుండా ఎంతో కట్టుదిట్టంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తానికి సూపర్ స్టార్ సినిమా ప్రారంభానికి ముందే సూపర్ టాక్ సొంతం చేసుకునేలా ఉంది.


Read More: Rashmika-Vijay Devarakonda: ‘నీకోసం నేను వాళ్లను స్పెషల్ గా తీసుకువస్తాను’.. రష్మికకి విజయ్ దేవరకొండ రిప్లై


Read More: Cucumber: సమ్మర్ లో కీర దోసకాయలు ఎక్కువగా తింటున్నారా..?.. ఈ విషయాలు తెలుసుకొండి..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook