Rajamouli Mahesh Babu Movie Update: మహేశ్ బాబు-రాజమౌళి.. ఈ కాంబినేషన్ కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినిమా కథ ఎలా ఉండబోతుంది.. హీరోయిన్ ఎవరు... షూటింగ్ ఎప్పుడు, రిలీజ్ ఎప్పుడు... ఇలా ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు ప్రేక్షకుల మదిని తొలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శక దిగ్గజం రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహేశ్‌తో సినిమాకు స్టోరీ ప్రిపరేషన్, ప్రీ ప్రొడక్షన్‌కు సుమారు 7 నెలల సమయం పడుతుందని రాజమౌళి తెలిపారు. ఈ ఏడాది చివరలో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించారు. రాజమౌళి సినిమా అంటే ఎంతలేదన్నా రెండేళ్లు పక్కా అన్నది అందరికీ తెలిసిందే. మహేష్‌తో రాజమౌళి సినిమా కూడా రెండు, మూడేళ్లు పట్టవచ్చునని చెబుతున్నారు.


మహేష్‌తో సినిమాకు సంబంధించి రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గతంలో ఓ విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆఫ్రికా అడవుల్లో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ తరహా కథతో తెరకెక్కించే ఆలోచన ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే అదే తరహా కథకు ఫిక్స్ అయ్యారా లేక మరో కథను సిద్ధం చేస్తున్నారా అన్నది ఇప్పటికైతే తెలియదు. 


ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత రాజమౌళితో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. 


Also Read: King Cobra in Bathroom: స్నానాలగదిలో కింగ్ కోబ్రా ప్రత్యక్షం.. షాక్ లో ఇంటి యజమాని!


Also Read: Telangana Weather: తెలంగాణలో ఆ 6 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook