RRR Latest Updates: దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆత్రుతగా ఎదురుచూశారో తెలిసిందే. ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు రూ.3 వేలు పెట్టి మరీ టికెట్ కొనుగోలు చేసిన ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే టికెట్ కోసం కొంతమంది ప్రజాప్రతినిధుల రికమండేషన్స్ కూడా తెచ్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. అంతలా క్రేజ్ ఏర్పడిన ఈ సినిమాకు ఒకచోట మాత్రం ప్రేక్షకులే లేకుండా పోయారు. అదీ ఏ మారుమూల ప్రాంతంలోనో కాదు.. హైదరాబాద్‌లోనే కావడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ పాతబస్తీలోని ఓ థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ సెకండ్ డే ఎర్లీ మార్నింగ్ షోకి ప్రేక్షకులు కరువయ్యారట. ఉదయం 7గంటల షోకి అసలు బుకింగ్స్ లేకపోవడంతో థియేటర్ యాజమాన్యం ఏకంగా షోని రద్దు చేసిందట. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే సైతం ఉదయం 7గంటల షో, 11 గంటల షోలు మాత్రమే హౌస్ ఫుల్ అయ్యాయట. మిగతా షోలకు అంతంతమాత్రం స్పందనే కనిపించదట.


ఓవైపు హైదరాబాద్‌లోని థియేటర్లలో టికెట్లు దొరక్క ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంటే.. మరోవైపు అదే హైదరాబాద్‌లోని పాతబస్తీ థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రేక్షకులు కరువవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికీ అక్కడ ఆర్ఆర్ఆర్‌కి ప్రేక్షకుల నుంచి స్పందన ఓ మోస్తరుగా మాత్రమే ఉందట. ఓవైపు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా పాతబస్తీలో ఈ పరిస్థితిని ఎదుర్కోవడం విచిత్రంగా అనిపిస్తోంది.


ఈ నెల 25న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో నటులుగా చరణ్, ఎన్టీఆర్ మరో మెట్టు ఎక్కారని... రాజమౌళి మరోసారి తన దర్శకత్వ ప్రతిభ ఏంటో చూపించాడని కొనియాడుతున్నారు. కలెక్షన్ల పరంగా విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ సినిమా రూ.615 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చెబుతున్నారు. హిందీలో ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్‌ని దాటేసినట్లు తెలుస్తోంది.


Also Read: Optical Illusion: ఈ చిత్రంలో ఎన్ని జంతువులున్నాయో చెప్తే.. మీరు నిజంగా మేధావే!


Also Read: Viral Video: నడిరోడ్డులో ఈ-రిక్షా డ్రైవర్ ను కొట్టిన పోలీస్- వీడియో వైరల్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook