RRR Shooting: భారతీయ సినీ పరిశ్రమలో టాప్ దర్శకుల జాబితా సిద్దం చేస్తే అందులో రాజమౌళి పేరు ఖచ్చితంగా ఉంటుంది. బాహుబలి చిత్రం తరువాత ప్రస్తుతం ఆ సెన్సేషనల్ దర్శకుడు RRR చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్ వంటి తారలు నటిస్తున్న విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | 7 Wonders: ప్రపంచంలో 7 అద్భుతాలు ఇవే


రాజమౌళీ  సినిమా అంటే సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది అని చాలా మంది అనుకుంటారు. బాహుబలికి (Baahubali) చాలా టైమ్ తీసుకున్నాడు. ప్రస్తుతం RRR చిత్రం విషయంలో కూడా అదే స్టైల్ పాటిస్తాడేమో అని అందరూ అనుకున్నారు. నిజానికి కరోనావైరస్ వల్ల అన్ని సినిమా షూటింగ్స్ కొన్ని నెలల పాటు జరగలేదు. దీంతో ఆ టైమ్‌ను కవర్ చేయడానికి ప్రస్తుతం దర్శక నిర్మాతలు వేగాన్ని పెంచారు. 



Also Read | Yearender 2020: ఈ  ఏడాది వివాహం చేసుకున్న సెలబ్రిటీలు ఎవరంటే...


రాజమౌళి (Rajamouli) కూడా ఈ వేస్ట్ అయిన టైమ్‌ను పూర్తిగా కవర్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. ఈ మేరకు తన టీమ్‌ను బాగా యాక్టివ్‌గా ఉండమని చెబుతున్నారు. ఒక ప్లాన్ వర్కవుట్ కాకపోతే వెంటనే మరో ప్లాన్ వేస్తూ ఆలస్యం జరకుండా చూసుకుంటున్నాడుట. RRR మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2022లో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook