Rajamouli at Toronto International Film Festival 2022: ఆర్ఆర్ఆర్ సినిమాతో 2022వ సంవత్సరంలో సూపర్ హిట్ అందుకున్న దర్శకధీరుడు రాజమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఫిలిం మేకర్స్ అందరూ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే టోరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్(టిఫ్)కి రాజమౌళి హాజరు కాబోతున్నారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం అందగా ఆయన హాజరు కాబోతున్నట్లు తమకు తెలిపిన విషయాన్ని టిఫ్ అధికారికంగా ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హాలీవుడ్ ప్రముఖులతో కలిసి రాజమౌళి 2022 టిఫ్ వేడుకలలో పాల్గొనబోతున్నారు. సెప్టెంబర్ 8 నుంచి 18 వరకు ఈ టొరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ టొరంటోలో జరగబోతోంది. ఇండియా లెవెల్ వరకే పరిమితమైన తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళికి ఈ గౌరవం మరింత వన్నె తీసుకురాబోతోంది అని చెప్పక తప్పదు. కెనడాలోని టొరంటోలో ఈ ఫిలిం ఫెస్టివల్ ప్రతి ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా అతిరథ మహారధుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.


ఈ వేడుకల్లో పలువురు టాప్ సినీ టెక్నీషియన్స్ తో టాప్ డైరెక్టర్లు చర్చలు జరిపి తమ పరిజ్ఞానాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి ఈ ఫెస్టివల్ కు రాజమౌళికి ఆహ్వానం అందింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఫిలిం ఫెస్టివల్ కు ఆహ్వానం అందిన తొలి తెలుగు వ్యక్తిగా రాజమౌళి నిలవబోతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆర్ఆర్ఆర్ సినిమాని ఈ ఫెస్టివల్ లో ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి ఒక సినిమా చేయాల్సి ఉంది.


మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా పూర్తి అయిన తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి రాజమౌళి రెస్ట్ మోడ్ లో ఉన్నట్టు చెప్పాలి. ఎందుకంటే కథ పూర్తయిందని విజయేంద్ర ప్రసాద్ పూర్తి కాలేదు అని మహేష్ బాబు చెబుతున్న నేపథ్యంలో కథ ఇంకా ఫైనల్ కాలేదని అది ఫైనల్ కావడానికి మరికొంత కాలం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Also Read: Arya Ghare: స్మశానంలో నటి బర్త్ డే సెలబ్రేషన్స్.. పైత్యం కాదండోయ్.. ఎందుకంటే?


Also Read: Raju Srivastava: విషమంగా కమెడియన్ ఆరోగ్య పరిస్థితి... ఇంకా వెంటిలేటర్ పైనే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.