Rajamouli : తెలుగు చిత్ర పరిశ్రమను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 అడుగులు ముందుకు తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. కేవలం సౌత్ ప్రేక్షకులకి మాత్రమే పరిమితమైన తెలుగు సినిమా చరిత్రని ఆస్కార్ రేంజ్ కి తీసుకెళ్లారు రాజమౌళి. అలాంటి సత్తా ఉన్న డైరెక్టర్ కి అలనాటి స్టార్ నటుడు సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఒక సినిమా ఏ మాత్రం నచ్చలేదట. అదే మంచి చెడు సినిమా. సినిమా తనకి ఏమాత్రం నచ్చకపోయినా అదే రాజమౌళి సినిమాలకి ఇన్స్పిరేషన్ గా మారిందట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాక్షన్ సినిమాలంటే బాగా ఇష్టం ఉన్న రాజమౌళి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చిన్నతనాన్ని గుర్తు చేసుకున్నారు. పెద్ద కుటుంబం నుంచి వచ్చిన రాజమౌళికి చిన్నప్పుడు కేవలం నెలకి ఒక సినిమానే చూసేలాగా కండిషన్ ఉండేదట. తమ ఊర్లో రెండు థియేటర్లు ఉండేవట. ఒకసారి అగ్గి పిడుగు సినిమా ఆడుతున్న సమయంలో మరో థియేటర్లోకి మంచి చెడు సినిమా వచ్చిందట. 


అగ్గి పిడుగు సినిమా చూసిన చాలామంది ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి అని సినిమాలో కత్తి ఫైట్స్ గురించి గొప్పగా చెప్పారట. దీంతో ఆ సినిమాకి వెళ్దామని రాజమౌళి రెడీ అవ్వగా మంచి చెడు సినిమాలో అన్నీ ఫైట్లే ఉన్నయంట అని అబద్ధం చెప్పి రాజమౌళిని ఆ సినిమాకి తీసుకువెళ్లారట. 


సినిమా మొదలైనప్పటి నుంచి రాజమౌళి ఫైట్ సీన్స్ కోసమే ఎదురు చూశారట. కానీ ఇంటర్వెల్ దాకా ఒక ఫైట్ సీన్ కూడా రాకపోవడంతో ఏడవటం మొదలు పెట్టారట. అంతేకాక సినిమా చివర్లో ఎన్టీఆర్ పాత్ర చనిపోగా రాజమౌళికి బాగా చిరాకు వచ్చేసిందట. సినిమా లో ఒక్క ఫైట్ సీన్ కూడా లేకపోవడం ఒక ఎత్తు అయితే హీరో పాత్ర అని చంపేసి సినిమాకి ట్రాజిక్ ఎండింగ్ ఇవ్వడం రాజమౌళికి అస్సలు నచ్చలేదట. 


అదే ఇప్పుడు రాజమౌళి సినిమాలకి ఇన్స్పిరేషన్ అయ్యిందట. ఆ సినిమా చూసిన రాజమౌళి తన సినిమాలలో మాత్రం ట్రాజిక్ ఎండింగ్స్ ఉండకూడదని నిర్ణయించుకున్నారట. అందుకే ఒక హీరో పాత్ర చనిపోయినా మరొక హీరో పాత్ర అయినా బతికుండి సినిమాకి హ్యాపీ ఎండింగ్ ఉండేలాగా చూసుకుంటారట రాజమౌళి. 


ఆ విధంగానే ఈగ సినిమాలో నాని పాత్ర చనిపోయినా మళ్లీ ఈగ రూపంలో నాని తిరిగి వస్తాడు. విక్రమార్కుడు సినిమాలో కూడా ఒక రవితేజ పాత్ర చచ్చిపోయినా మరొక రవితేజ పాత్ర బతికే ఉండి ఈ సినిమాకి హ్యాపీ ఎండింగ్ వస్తుంది. బాహుబలి సినిమాలో కూడా అమరేంద్ర బాహుబలి పాత్ర చనిపోయినా మహేంద్ర బాహుబలి పాత్రతో సినిమాకి మంచి ఎండింగ్ వస్తుంది.


అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా ముందు జెన్నీ పాత్రని చంపేయాలని భావించారు కానీ చివరి నిమిషంలో ఆ ఆలోచనని విరమించుకున్నారట. ఇక ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది.


Also Read: తెలుగు నేలతో బాబా సాహెబ్ అంబేద్కర్ అనుబంధం..


Also Read: ఖమ్మం పాలిటిక్స్ లో కీలక పరిణామం.. భట్టి, తుమ్మల ఏకమై.. పొంగులేటికి చెక్..?



 


 


 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter