Rajinikanth: రజనీకాంత్ ప్రవర్తన పై తెలుగు ఫ్యాన్స్ ఫైర్.. ఇదేం బాలేదంటూ కామెంట్స్..!
Rajinikanth Upcoming Movie: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ కి ఎంత మంచి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మేనరిజంతో , అద్భుతమైన పర్ఫామెన్స్ తో స్టైల్ తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ కి ఒకానొక సమయంలో చాలామంది తెలుగు హీరోలు కూడా సపోర్ట్ చేశారనే విషయం అందరికీ తెలిసిందే.
Rajinikanth Vettaiyan Controversy: సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఎంతోమంది ఆడియన్స్ ను తన వశం చేసుకున్న ఈయన జపాన్లో కూడా స్టార్ హీరోగా నేటికీ చలామణి అవుతున్నారంటే ఇక ఆయన స్టైల్ కి, ఆయన పెర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ ఏ రేంజ్ లో అడిక్ట్ అయ్యారో చెప్పవచ్చు.
ఇలాంటి రజనీకాంత్ పై తెలుగు ఆడియన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. భాషను గౌరవించడం అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీ తప్పకుండా ఫాలో అవ్వాల్సిన రూల్ . ఆ బేసిక్ రూల్ ని ఈ మధ్య తమిళ నిర్మాతలు లెక్కచేయడం లేదు. ముఖ్యంగా తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేయడం అనేది అనాదిగా వస్తున్న ఆనవాయితీ అనే చెప్పాలి. అయితే ఇప్పటివరకు తెలుగు డబ్బింగ్ అనగానే తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యే మంచి టైటిల్ పెట్టేవారు.
కానీ ఈమధ్య తమిళ సినిమాలను తమిళ టైటిల్ తోనే తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఈ ఒరవడి మొదలు పెట్టింది హీరో అజిత్ అనే చెప్పాలి. తమిళ్లో అజిత్ వలిమై సినిమాను రిలీజ్ చేయగా.. అదే పేరుతో తెలుగులో కూడా విడుదల చేశారు. అటు సూర్య కూడా తాజాగా కంగువ చిత్రంలో నటిస్తున్నారు. తమిళ్ టైటిల్ తోనే ఇప్పుడు అన్ని భారతీయ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు .ఇప్పుడు అదే జాబితాలోకి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా చేరిపోయారు.
తాజాగా రజినీకాంత్ నటించిన చిత్రం వేట్టయన్.. అంటే తెలుగులో వేటగాడు అని అర్థం. మరి ఇలా కనీసం తెలుగు టైటిల్ మార్చకుండా భాషను అవమానపరచడం అనేది రజనీకాంత్ నుండి ఆడియన్స్ ఊహించలేదు. ఇక అక్టోబర్ 10వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్య విడుదల చేశారు. ఏది ఏమైనా రజనీకాంత్ కూడా ఇలా చేయడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై రజినీకాంత్ ఏదైనా సమాధానం ఇస్తారో చూడాలి.
Also Read: Sobhita Chaitanya: నాకు నాగచైతన్యతో పిల్లలు కనాలని ఉంది: శోభిత ధూళిపాల
Also Read: KTR Comments on Devara: దేవర ఈవెంట్ రద్దుపై కేటీఆర్ సంచలన కామెంట్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.