Jailer HD Available For Free Download: రజనీకాంత్ రెండేళ్ల తరువాత జైలర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. అంచనాలకు తగినట్లే బ్లాక్‌బస్టర్ టాక్‌తో జైలర్ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కగా.. తలైవాకు జోడిగా తమన్నా నటించింది. పాన్‌ఇండియా లెవల్లో కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. తలైవా ఈజ్ బ్యాక్ అంటూ జైలర్ మూపై ప్ర‌శంస‌ల వర్షం కురుస్తుండగా.. ఇంతలో మేకర్స్‌కు షాక్ తగిలినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'జైలర్' థియేటర్లలోకి వచ్చిన కొన్ని కొన్ని గంటల్లోనే పైరసీ బారిన పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అనేక పైరసీ సైట్లలో హెచ్‌డీ ప్రింట్ అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. పైరసీ సైట్లలో లీక్ కావడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెలిగ్రామ్, తమిళ్ రాకర్స్, టొరంటో, మూవీ రూల్జ్ వంటి వెబ్‌సైట్ల చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. జైలర్ మూవీని పైరసీలో చూడొద్దని కోరుతున్నారు. సినిమాను డౌన్‌లోడ్ చేసుకోని చూస్తుండడంతో మేక‌ర్స్‌కి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. జైలర్ మూవీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిందేనని.. ఆ థ్రిల్ మిస్‌ అవ్వకూడదని అంటున్నారు సినీ ప్రియులు. 


ప్రపంచవ్యాప్తంగా జైలర్ మూవీ నేడు  దాదాపు 7 వేల స్క్రీన్లలో విడుదలైంది. రమ్యకృష్ణ, శివరాజ్‌ కుమార్, మోహన్‌లాల్, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. ఇక ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను స‌న్ నెక్ట్స్‌ ద‌క్కించుకుంది. సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారం నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రం ఓటీటీ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్‌ కూడా ప్రయత్నిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ కూడా డీల్ సెట్ అయితే రెండు ఓటీటీ ఫ్లారమ్స్‌లో ఒకే రోజు విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. శాటిలైట్ రైట్స్‌ను జెమిని టీవీకి దక్కాయి.


Also Read: Hyderabad Metro: మెట్రో రైల్ విస్తరణపై వేగంగా అడుగులు.. మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ రివ్యూ  


Also Read: RBI Repo Rate: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ.. రెపో రేటుపై కీలక నిర్ణయం  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook