Rajinikanth - Lal Salaam: అసలు ఇలాంటి ఓ రోజు వస్తుందని బహుశా రజినీకాంత్‌ ఫ్యాన్స్‌తో పాటు ఆయన కూడా ఊహించి ఉండరు. ఏదైతే చూడకూడదని ఆయన అభిమానులు ఆశించారో అదే జరిగింది రజినీకాంత్ విషయంలో. మొత్తంగా అయ్యో ఫాఫం అనేలా తయారైంది రజినీకాంత్ పరిస్థితి. అది కూడా 'జైలర్' వంటి సూపర్ బ్లాక్ బస్టర్ తర్వాత రజినీ నుంచి వచ్చిన సినిమా 'లాల్ సలాం'. ఈ సినిమాలో తలైవాను యాక్ట్ చేయమని తన కూతురు ఐశ్వర్య అడగడం..లేక లేక తన కూతురు ఎన్నో ఏళ్ల తర్వాత మెగాఫోన్ పట్టుకోవడం వంటి కొన్ని మొహమాటాల కొద్ది ఈ సినిమాను రజినీకాంత్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో తలైవా రాకతో ఈ మూవీ లెవల్ కూడా పెరిగింది. తీరా రిలీజ్‌ సమయం వచ్చే వరకు ఈ మూవీపై ఎలాంటి హోప్స్ లేవు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తమిళంలో ఈ సినిమా చూడటానికి ఆయన ఫ్యాన్స్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. దీంతో తమిళనాడులో చాలా చోట్ల ప్రీమియర్స్ కాకుండా.. డైరెక్ట్ మార్నింగ్ షోలతో ఈ సినిమాను విడుదల చేసారు. ఇక తెలుగులో 'లాల్ సలాం' వంటి ఓ సినిమా వస్తుందని కూడా ఇక్కడ ప్రేక్షకులకు కూడా తెలియలేదు. ఇక్కడ మినిమం ప్రమోషన్స్ చేయలేదు. ఈ సినిమా రిజల్ట్ పై నమ్మకం లేకపోవడంతోనే ఇక్కడ ప్రచారం చేయలేదనే విషయం అర్ధం అవుతోంది. ఈ సినిమాలో రజినీకాంత్ స్పెషల్ కెమియో అని చెప్పారు. కానీ ఈ సినిమా మొత్తం ఆయన పాత్రే ఉంది. ఈ సినిమాకు ఆయనే ప్లస్. ఆయన మైనస్ గా మారారు. తండ్రి వంటి సూపర్ స్టార్‌ను పెట్టుకొని కూడా రొటిన్ కథతో ఈ సినిమాను తెరకెక్కించడం ఈ సినిమాకు కోలుకోలేని దెబ్బ తీసింది.


ఇక 'లాల్ సలాం' తెలుగులో కొన్ని లిమిటెడ్ థియేటర్స్‌లో విడుదల చేసారు. అక్కడ ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు పోలోమంటూ వస్తారని ఎక్స్‌పెక్ట్ చేసారు. కానీ జరిగింది వేరు. ఈ సినిమాను రిలీజ్ చేసిన థియేటర్స్‌లో ప్రేక్షకులు లేకపోవడంతో చాలా చోట్ల ఈ సినిమా షోలను థియోటర్స్ నిర్వాహకులు కాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. ఓ రకంగా రజినీకాంత్ జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏదైతే జరగకూడదని ఆయన ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసారో అదే జరిగింది. అప్పట్లో మోహన్ బాబు హీరోగా నటించిన 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రానికి ఇదే పరిస్ధితి ఎదురైంది. అప్పట్లో టాలీవుడ్ పెదరాయుడికి షాక్ ఇచ్చిన ప్రేక్షకులు.. అదే పెదరాయుడి పాత్రకు తండ్రిగా నటించిన పాపారాయుడు అదేనండి రజినీకాంత్‌కు అదే విధమైన షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఏది ఏమైనా.. భారతీయ చిత్ర పరిశ్రమలో దాదాసాహెబ్ వంటి అత్యున్నత పురస్కారంతో పాటు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అందుకున్న ఈ లెజండరీ నటుడి పరువును ఆయన కూతురే'లాల్ సలాం' మూవీతో స్వయంగా తీసిందని తలైవా అభిమానులే చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా రజినీకాంత్ పరువును మూసీ నదిలో నిండా ముంచిందనే అపవాదును మూటగట్టుకుంది ఐశ్వర్య రజినీకాంత్.  


Also Read: YSRCP MP Candidates: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. మూడో స్థానానికి కూడా పోటీతో ఎన్నికలు రసవత్తరం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter