Lal Salaam Trailer: రజనీకాంత్ ముఖ్య పాత్రలో ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన సినిమా లాల్ సలామ్. విష్ణు విశాల్-విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ ఒక చిన్న పాత్రలో కనిపించనున్నారు.ఫిబ్రవరి 9న లాల్ సలామ్ థియేటర్లలోకి వస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఈ సినిమా తెలుగు ట్రైలర్ ఈరోజు విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందుగా ఈ ట్రైలర్ ‘ఊర్లో ఒక్క మగాడు లేడా? ఊర్లో ఉన్నొళ్లందరినీ తీసుకెళ్లి బొక్కలో వేశారు’ అనే డైలాగ్‌తో మొదలై ఆ తరువాత ఊరి వాతావరణం, క్రికెట్ ఆట, జాతర సీన్లు, రాజకీయంతో ముడిపడ్డ సన్నివేశాలను చూపిస్తూ ఆసక్తిగా సాగింది. ‘మందిని కూడ బెట్టేవాడి కన్నా కూడా ఎవరి వెనకాల మంది ఉంటారో వాడే చాలా ప్రమాదకరం.. వాడ్ని ప్రాణాలతో వదిల పెట్టకూడదు’ అనే డైలాగ్‌తో రజినీకాంత్ ఎంట్రీ ఇచ్చి అక్కడి నుంచి ఈ ట్రైలర్ ని ఎక్కడికో తీసుకెళ్లారు.  ‘బిడ్డ సంపాదిస్తే ఇంటికి గౌరవం.. బిడ్డ సాధిస్తే దేశానికే గౌరవం’, ‘మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో.. మానవత్వాన్ని అందరితో పంచుకో.. ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే’ అని రజనీకాంత్ చెప్పే డైలాగ్స్ ఈ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి.


 



మొత్తం పైన ఈ ట్రైలర్ చూస్తే సినిమాలో కథ ఎలా ఉండబోతోందో అనే ఐడియా ప్రేక్షకులకు రాకమానదు. ఊరు.. ఊర్లోని రకరకాల మతాలకు చెందిన మనుషులు, రాజకీయ నాయకులు వంటి అంశాలతో ఈ సినిమా ఒక మంచి పొలిటికల్ థ్రిల్లర్ గా ఉండబోతుంది అని అర్థమవుతోంది. కానీ ఈ ట్రైలర్ చూసాకా అందరికి వస్తున్న ఒకే ఒక్క డౌట్ రజనీకాంత్ వాయిస్ ఎందుకు తేడాగా ఉంది అని. మొదటినుంచి రజినీకాంత్ కి సింగర్ మనోనే డబ్బింగ్ చెప్తూ వస్తున్నాడు. అది ఆయనకి ఎంతగానో సెట్ అయింది. అయితే ఈసారి మాత్రం రజనీకాంత్ కు నటుడు సాయి కుమార్ డబ్బింగ్ చెప్పాడు. అది సెట్ అవ్వడం ఏమో కానీ, ట్రైలర్ మొత్తం సాయి కుమార్ ఉన్నట్లే అనిపిస్తుంది. అందుకే ప్రేక్షకుల దగ్గర నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అందుకే ట్రైలర్ కన్నా కూడా ఈ ట్రైలర్ లో రజనీకాంత్ వాయిస్ గురించే ఎక్కువగా చర్చ సాగుతోంది. మరి సినిమా విడుదలయ్యాక ఈ డబ్బింగ్ తెలుగు రిలీజ్ ని ఎలా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.


 


Also read: AP Elections 2024: ఏపీ ఎన్నికల్లో పొత్తు పొడిస్తే..బీజేపీ ఆశిస్తున్న స్థానాలివే, ఇవాళ అమిత్ షాతో చంద్రబాబు భేటీ


Also read: AP Cabinet 2024: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మూడు ప్రైవేట్ వర్శిటీలకు గ్రీన్ సిగ్నల్


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook