ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన రజినీ చిత్రం `బాషా`
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన `బాషా` చిత్రం (డిజిటల్ వెర్షన్) అమెరికాలో ప్రారంభమయ్యే `ఫెంటాస్టిక్` చలన చిత్రోత్సవానికి ప్రత్యేక ప్రదర్శనగా ఎంపికయ్యింది. వైవిధ్యమైన కథనాలతో రూపొందే వివిధ దేశాల చిత్రాలను ప్రదర్శించడం ఈ చలన చిత్రోత్సవం ప్రత్యేకత. హారర్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అంశాలతో పాటు పలు వైవిధ్యమైన కథలతో రూపొందిన సినిమాలను కూడా ఈ చిత్రోత్సవంలో ప్రదర్శిస్తారు. గత 12 సంవత్సరాలుగా అమెరికాలో ఈ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సరం కూడా మన దేశం నుండి కమల్ హాసన్ నటించిన `ఆళవందన్` చిత్రం ఈ చిత్రోత్సవానికి ఎంపికయ్యింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 21 నుండి 24వ తేదీ వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో `బాషా` చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శనగా ఎంపిక చేయడం విశేషం.
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "బాషా" చిత్రం (డిజిటల్ వెర్షన్) అమెరికాలో ప్రారంభమయ్యే "ఫెంటాస్టిక్" చలన చిత్రోత్సవానికి ప్రత్యేక ప్రదర్శనగా ఎంపికయ్యింది. వైవిధ్యమైన కథనాలతో రూపొందే వివిధ దేశాల చిత్రాలను ప్రదర్శించడం ఈ చలన చిత్రోత్సవం ప్రత్యేకత. హారర్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అంశాలతో పాటు పలు వైవిధ్యమైన కథలతో రూపొందిన సినిమాలను కూడా ఈ చిత్రోత్సవంలో ప్రదర్శిస్తారు. గత 12 సంవత్సరాలుగా అమెరికాలో ఈ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సరం కూడా మన దేశం నుండి కమల్ హాసన్ నటించిన "ఆళవందన్" చిత్రం ఈ చిత్రోత్సవానికి ఎంపికయ్యింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 21 నుండి 24వ తేదీ వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో "బాషా" చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శనగా ఎంపిక చేయడం విశేషం.
1995లో విడుదలైన బాషా చిత్రం తెలుగుతో పాటు కొన్ని ఇతర భాషల్లో కూడా డబ్ అయ్యింది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో రజనీకాంత్, నగ్మా, రఘువరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రము అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. 2013లో తెలుగు , తమిళ భాషలలో ఈ చిత్ర డిజిటల్ వెర్షన్ కూడా విడుదల అయ్యింది.