Bigg Boss: `నిద్ర పోవడానికే బిగ్‌బాస్ షోకు వెళ్తున్నారు`..బాలీవుడ్ నటి రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు
Bigg Boss: బిగ్‌బాస్ షోపై ఘాటు వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ నటి రాఖీ సావంత్. కంటెస్టెంట్లు ఎంటర్ టైన్ చేయకుండా.. కేవలం నిద్రపోవడానికి ఆ షో కు వెళ్తున్నారంటూ విమర్శించింది.
Bigg Boss: బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడే షో.. బిగ్ బాస్. ఈ రియాలిటీ షోను గ్రాండ్ గా ప్లాన్ చేస్తూ..రెట్టింపు వినోదాన్ని అందించాలని చూస్తుంటారు నిర్వాహకులు. బిగ్ బాస్ హౌస్ డిజైన్ నుంచి కంటెస్టెంట్ల ఎంపిక వరకు ప్రతీది చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ మధ్యే హిందీ బిగ్‌బాస్(Bigg Boss Season 15) 15వ సీజన్ ప్రారంభమైంది. ఈసారి సల్మాన్ ఖాన్(Salman Khan) స్థానంలో కరణ్ జోహార్(Karan Johar) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'వూట్(Voot)'లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.
ఈ బిగ్ బాస్ 15వసీజన్ పై సంచల వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ నటి రాఖీ సావంత్(Rakhi Sawanth). కేవలం కొందరు నిద్రపోవడానికి బిగ్‌బాస్(Bigg Boss) షోకు వెళ్లారని పెదవి విరుస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలామంది కంటెస్టెంట్లు అది చేస్తాం, ఇది చేస్తాం అని బీరాలు పలుకుతూ హౌస్‌లోకి వెళతారు. కానీ అక్కడికి వెళ్లాక అందరూ బొక్క బోర్లా పడతారు. ఈసారి హౌస్‌లో అడుగు పెట్టిన సింగర్ స్నేహా భాసిన్(Singer Sneha Bhasin) అయితే షోలో ఎందుకూ పనికి రాకుండా పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది రాఖీ.
Also Read: Neha Bhasin photos gallery: నేహా భాసిన్ ఫోటో గ్యాలరీ.. వైరల్‌గా మారిన బిగ్ బాస్ ఓటిటి బ్యూటీ ఫోటోస్
అదే విధంగా మరో ఇద్దరు కంటెస్టెంట్లు మిలింద్(Milind), రాకేశ్(Rakesh)లపై కూడా విరుచుకుపడింది. వారు నిద్ర పోవడానికే షోకి వచ్చినట్లుందని, కరోనా(Corona) వల్ల ఈ రెండేళ్లు నిద్రపోలేదా అన్నట్లు ప్రవర్తిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించింది రాఖీ. వారు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి..ఆటపై దృష్టి పెడితే బాగుంటుందని చురకలంటించింది. ఈ ఇద్దరూ వేరేవాళ్ల గొడవలో తలదూర్చరని, పోనీ వాళ్లైనా గొడవపడతారా? అంటే అదీ లేదని.. అసలు వీళ్లు ప్రేక్షకులకు ఏమాత్రం వినోదం అందించట్లేదని చెప్పుకొచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook