"బిగ్‌బాస్‌" (Bigg Boss)... ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన TV షో.  భాష ఏదైనా సరే ఒకసారి బిగ్‌బాస్‌ షో ప్రారంభమైతే చాలు ఆ ఛానెల్ టీఆర్పీ రేటింగ్స్‌ ఆకాశాన్ని అందుకుంటాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి అనుకున్న దాని కన్నా ఎక్కువ వినోదం పొందటంతో ఈ షో మన దేశంలో చాలా ప్రాచుర్యం పొందింది. ప్రజల మద్దతు కూడా బిగ్‌బాస్‌ హౌస్ లో కంటేస్టెంట్ లకు దొరకటంతో సామాన్య ప్రజలు సైతం వారికి ఇష్టమైన స్టార్ లకు మద్దతు తెలుపుతూ ఓటింగ్ చేస్తూ ఉంటారు. 


Also Read: Central government: న్యాయమూర్తులకు ఆ తరహా రక్షణ సాధ్యం కాదు


బిగ్‌బాస్‌ హౌస్ (Bigg Boss House) లో పాల్గొనటానికి చాలా మంది హీరో - హీరోయిన్ లు, యూ ట్యూబ్ స్టార్స్, సోషల్ మీడియా స్టార్స్ సైతం సుముఖతను తెలియజేస్తారు, ఎందుంటే బిగ్‌బాస్‌ వల్ల వచ్చే ఫేం అంత ఇంత కాదు, కొన్నిసార్లు సామాన్య ప్రజలు కూడా ఈ షోలో పాల్గొంటుంటారు.


ఇదిలా ఉండగ హిందీలో బిగ్‌బాస్‌ 15 ఓటీటీ (Hindi Bigg Boss 15 OTT) ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే, కాకపొతే ఎల్లపుడు వివస్పాదాలు చేస్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బాలీవుడ్ (Bollywood) నటి రాఖీ సావంత్ (Rakhi Sawant) తాజాగా బిగ్‌బాస్‌ 15 ఓటీటీ లో తనని తీసుకోవాలని వినూత్న రీతిలో నిరసన చేస్తూ వార్తల్లోకి ఎక్కింది. మంగళవారం ఉదయం, స్పెడర్‌ ఉమెన్‌ వేషం (Spider Women) వేసి, ముంబై (Mumbai)  వీధుల్లో హల్‌ చల్‌ చేస్తూ, అభిమానులతో కలిసి డ్యాన్స్‌ చేసింది. ఇపుడు కాస్త ఆ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.



Also Read: Facebook on Talibans: తాలిబన్‌పై నిషేధం విధించిన ఫేస్‌బుక్, ఇదే కారణం


తనకు బిగ్‌బాస్‌ షో అంటే ఇష్టమని, తనని ఎందుకు ఆహ్వానించలేదని ఒక వీడియో లో బిగ్‌బాస్‌ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. అంతేకాకుండా," నేను రాఖీ సావంత్ కాదు, స్పైడర్ ఉమెన్ ని అంటూ వింత  చేష్టలతో అభిమానులను అలరించింది. ఇపుడు రాఖీ సావంత్ స్పైడర్ ఉమెన్ ఫోటోలు మరియు వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ సీజన్ వోట్‌ జరుగుతుండగా.. కరణ్ జోహార్ (Karan Johar) హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook