Rakshith Shetty - Rishabh Shetty- Raj b Shetty Back to Back Hits to Kannada Movie Industry: ఒకప్పుడు కన్నడ సినీ పరిశ్రమలో ఇతర భాషల నుంచి సినిమాలు రీమేక్ చేయడానికి ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు అక్కడ ట్రెండ్ మారింది. కేజిఎఫ్ దెబ్బతో కన్నడ సినీ పరిశ్రమ వంక మిగతా భాషల వాళ్ళు కూడా చూస్తూ ఉండడంతో అక్కడి మేకర్లు తమ ఒరిజినల్ కథలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.  మరీ ముఖ్యంగా గత ఏడాది వ్యవధిలో గనక మనం చూస్తే అక్కడి నుంచి వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందులో కేజిఎఫ్ 2ని కలపడం లేదు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు ప్రత్యేకంగా కన్నడ రాష్ట్రానికి, కన్నడ సినీ పరిశ్రమకు మంచి వన్నె తీసుకొచ్చాయి. అది కాస్త భారీ బడ్జెట్ సినిమా అయితే తక్కువ బడ్జెట్ లో ప్రేక్షకులు అందరూ మెచ్చే విధంగా కొన్ని కన్నడ సినిమాలు వచ్చాయి. ఆ కన్నడ సినిమాలు మూడింటిలోనూ ‘శెట్టి’లదే హవా. ఆ ముగ్గురే రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రాజ్ బీ శెట్టి. అసలు విషయం ఏమిటంటే రాజ్ బీ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన గరుడ గమన వృషభ వాహన సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.


స్వయంగా కథ రాసుకుని రాజ్ బీ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాలో రిషబ్ శెట్టి కూడా ఒక కీలకపాత్రలో నటించారు. గత ఏడాది నవంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే రష్మిక మందన మాజీ ప్రియుడు, రక్షిత్ శెట్టి హీరోగా నటించిన 777 చార్లీ సినిమా కూడా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాక ఈ సినిమాకు స్వయంగా నిర్మాతగా వ్యవహరించారు రక్షిత్ శెట్టి. ఇక ఈ సినిమా కాకుండా ఇటీవల విడుదలైన కంటార సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది.


హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటించడమే కాక డైరెక్ట్ కూడా చేశారు. ఈ సినిమా ద్వారా ముగ్గురు శెట్టిలు కన్నడ సినీ పరిశ్రమకు ఏడాదిలోనే మూడు సూపర్ హిట్లు  ఇచ్చినట్లు అయింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కన్నడ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ముగ్గురు కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు. ఒకరి సినిమాలో ఒకరు నటించడం అలాగే ఒకరి సినిమాకి ఒకరు సహకారం అందించుకోవడం వంటి విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి . 
Also Read: Godfather Collections: మూడు రోజులైనా ఖైదీ నెం.150 మొదటి రోజు కలెక్షన్స్ బీట్ చేయలేకపోయిన గాడ్ ఫాదర్!


Also Read: Adipursh Court Case: ఆదిపురుష్ కు మరో షాక్.. స్టే విధించాలంటూ హైకోర్టులో పిటిషన్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook