Double Ismart Teaser:
రామ్ పోతినేని ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ హీరో సినిమా అప్డేట్స్ గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రామ్.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న డబుల్ ఇస్మార్ట్ టీజర్ విడుదలై రామ్ అభిమానులను కిరికిరి చేస్తొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూరి జగన్నాధ్, రామ్ పోతినేని, కాంబోలో 2019లొ వచ్చిన సూపర్ హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ గా ‘డబల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై పూరి జగన్నాథ్ కి ఎన్నో ఆశలు ఉన్నాయి. లైజర్ లాంటి డిజాస్టర్ తర్వాత ఈ దర్శకుడు తీస్తున్న సినిమా కావడంతో.. ఈ చిత్రంపై ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు వినికిడి . మరోపక్క రామ్ కి కూడా ఇస్మార్ట్ శంకర్ తరువాత అలాంటి సూపర్ హిట్ పడలేదు. అందుకే పూరి.. రామ్.. మళ్లీ డబల్ ఇస్మార్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటారని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతుంది. పూరి జగన్నాధ్ సొంత దర్శక నిర్మాణంలో డబల్ ఇస్మార్ట్ భారీగా చిత్రీకరిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు.


ఇటీవలే డబల్ ఇస్మార్ట్ నుంచి రామ్ పోతినేని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక అదే మాటను నిలబెట్టుకుంటూ ఈ చిత్రమే నేడు రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్భంగా డబల్ ఇస్మార్ట్ టీజర్ రిలీజ్ చేశారు. మొదటి భాగం లో మణిశర్మ మ్యూజిక్ క్రియేట్ చేసిన సెన్సేషన్ మనకు తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ టీజర్ చూస్తుంటే మరోసారి మణిశర్మ బీభత్సం క్రియేట్ చేసినట్టు అర్థమవుతుంది. ఇస్మార్ట్ శంకర్ స్టైల్ లోనే రామ్ ఊర మాస్ డైలాగ్స్.. పూరి ఊర మాస్ డైరెక్షన్.. మణిశర్మ టాప్ లేచిపోయే మ్యూజిక్ ఈ టీజర్ లో కనిపిస్తోంది. మరోసారి ఈ సినిమా రామ్.‌ పూరి‌‌ మణిశర్మ అభిమానుల దిమాక్ కిరికిరి చెయ్యడం ఖాయమని కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. 


 



Read more: MP Elections 2024: ఎన్నికల వేళ కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. ఇద్దరు భార్యలున్న వారికి కూడా ఆ పథకం.. వీడియో వైరల్..


Read more: Smell of Cooking Food: వంట స్మెల్ చూసి వావ్ అంటున్నారా..?.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎన్ఓఏఏ పరిశోధకులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter