Game Changer New Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో.. తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా సినిమా నుండి ఈ మధ్యనే విడుదలైన రా మచా మచా పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా విడుదలవుతుంది అని ప్రకటించగా.. డిసెంబర్ 20న సినిమా విడుదల అవుతుంది అని అందరు అనుకున్నారు. దీంతో డిసెంబర్లో విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు వాయిదా కూడా పడ్డాయి. కానీ తాజాగా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా కూడా వాయిదా పడింది. డిసెంబర్ 20న విడుదల కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ 25 కి వాయిదా పడింది. 


దీంతో సినిమా విడుదల కేవలం ఐదు రోజులు వాయిదా పడినా కూడా.. ఈ గ్యాప్ ని వాడుకోవడానికి ఇద్దరు హీరోలు రెడీ అయిపోయారు. అందులో ఒకరు అక్కినేని నాగచైతన్య. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తండేల్ సినిమా డిసెంబర్ 20న విడుదలకు సిద్ధం అవుతుంది. గేమ్ చేయించారు సినిమా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతుంది అని అందరు అనుకున్నారు కానీ.. గేమ్ చేంజర్ సినిమానే వాయిదా పడటంతో తండేల్.. అనుకున్న డేట్ కి వచ్చేస్తోంది.


గేమ్ చేంజర్ సినిమా విడుదల వాయిదా పడటంతో.. డిసెంబర్ 20న మరొక సినిమా విడుదల కి రెడీ అయింది. అదే మ్యాడ్ 2. సంగీత్ శోభన్ హీరోగా నటించిన మ్యాడ్ సినిమాలో.. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ కూడా నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 


చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద స్థాయిలో సక్సెస్ అందుకున్న ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు మ్యాడ్ 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గేమ్ చేంజర్ సినిమా విడుదల వాయిదా పడటంతో.. మ్యాడ్ 2 కూడా డిసెంబర్ 24 విడుదల అవడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాల విడుదల తేదీలకి సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలో వెలువడనున్నాయి.


Also Read: MP Dharmapuri Arvind: కాంగ్రెస్ ఆ హామీ చూసి నాకే ఓటు వేయాలనిపించింది.. ఎంపీ ధర్మపురి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 


Also Read: Hyderabad to Ayodhya Flight Service: రామభక్తులకు అదిరిపోయే శుభవార్త..  భాగ్య నగరం నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.