Ram Charan And Kannada Director Narthan మెగా అభిమానులు ప్రస్తుతం ఫుల్ ఖుషీ అవుతున్నారు. రామ్ చరణ్‌కు ఆస్కార్ అవార్డు వచ్చినా కూడా ఇంత సంతోషిస్తారో లేదో గానీ రామ్ చరణ్ తండ్రి కాబోతోన్నాడంటూ వచ్చిన ప్రకటనకు మాత్రం తెగ సంబరపడిపోతోన్నారు. దాదాపు దశాబ్దం పాటుగా ఈ శుభవార్త కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక లయన్ కింగ్, సింబా, ముఫాసా వీడియోలతో జూ. రామ్ చరణ్‌ రాబోతోన్నాడంటూ మెగా అభిమానులు చేస్తోన్న సందడి అందరికీ తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామ్ చరణ్‌ అయితే ఇప్పుడు తన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. శంకర్ సినిమాకు సంబంధించిన సాంగ్‌ను న్యూజిలాండ్‌కు వెళ్లి షూట్ చేసి ఈ మధ్యే వచ్చాడు రామ్ చరణ్‌. గౌతమ్ తిన్ననూరితో సినిమాను క్యాన్సిల్ చేసి బుచ్చిబాబుతో ఓ చిత్రాన్ని కన్ఫామ్ చేశాడు. అయితే ఈ సమయంలోనే కన్నడ దర్శకుడు నార్తన్‌తోనూ ఓ సినిమా చేస్తాడనే టాక్ వచ్చింది.


కానీ బుచ్చిబాబు సినిమా అనౌన్స్ చేయడంతో కన్నడ దర్శకుడితో సినిమా లేదని అంతా అనుకున్నారు. కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు కన్నడ దర్శకుడితో రామ్ చరణ్‌ సినిమా చేస్తాడని, దాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుందని టాక్. ఇది మొత్తం కూడా యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉంటుందని తెలుస్తోంది. పూర్తిగా స్క్రిప్ట్ రెడీ చేయమని రామ్ చరణ్ చెప్పినట్టు తెలుస్తోంది.


ఇదిలా ఉంటే.. రామ్ చరణ్‌ ఆ తరువాత సుకుమార్, ప్రశాంత్ నీల్ వంటి వారితో కూడా పని చేయబోతోన్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ రామ్ చరణ్‌ సుకుమార్ సినిమాకు సంబంధించిన ఇంట్రో సీన్ గురించి రాజమౌళి చెప్పి ఎంతగానో హైప్ ఎక్కించాడు. మరి ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.


Also Read : waltair Veerayya Boss Party : పరుగులో ఆగిన బాలయ్య.. దూసుకుపోతోన్న చిరంజీవి


Also Read : RGV Siri Stazie : రాళ్లతో కొట్టి చంపేసేవారు, వెలేసేవారు.. అలా బతికిపోయారు.. ఆర్జీవీపై బీవీఎస్ రవి కామెంట్స్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook