Ram Charan And KTR in Unstoppable రామ్ చరణ్, కేటీఆర్‌ల స్నేహం గురించి అందరికీ తెలిసిందే. మామూలుగానే కేటీఆర్‌కు ఇండస్ట్రీతో మంచి సంబంధాలున్నాయి. అందులోనూ రామ్ చరణ్‌తో అయితే ఎన్నో ఏళ్లు అనుబంధం ఉంది. వీరి బంధాన్ని ఇది వరకు ఎన్నో వేదికల మీద చూశాం. కానీ ఇప్పుడు ఆ బంధాన్ని బాలయ్య అన్ స్టాపబుల్ షోలో చూడబోతోన్నాం. ఈ మేరకు కొన్ని లీక్స్ చక్కర్లు కొట్టేస్తున్నాయి. ఈ ఎపిసోడ్‌తో అన్ స్టాపబుల్ షో మరో సెన్సేషన్ క్రియేట్ చేయనున్నట్టు కనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే బాలయ్య ప్రభాస్ ఎపిసోడ్‌ దెబ్బకు ఆహా క్రాష్ అయిపోయింది. కొన్ని గంటల పాటు ఆహా టీం విలవిల్లాడింది. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఒకే సారి ఆహా మీద పడిపోయారు. ఆహా టీం ఎలాగోలా కష్టపడి మళ్లీ సిస్టంను సెట్ చేశారు. ఆహా మళ్లీ పని చేయడం ప్రారంభించింది. ఇంతలా ఒకే సారి ప్రభాస్ అభిమానులు వస్తారని, చూస్తారని ఎక్స్ పెక్ట్ చేయలేదని ఆహా టీం చెప్పుకొచ్చింది.


ఇక రెండో పార్ట్ కూడా రాబోతోంది. ఇదే ఇలా ఉంటే.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ టైంకు ఇంకేం అవుతుందో అని నెటిజన్లు అనుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం చేస్తారన్న దాని మీద అయితే ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే సంక్రాంతికి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ సంక్రాంతికి తన కొత్త సినిమా వీర సింహా రెడ్డి స్పెషల్ షోను రన్ చేయించుకుంటాడని టాక్.


అదే జరిగితే జనవరి చివర్లో పవన్ కళ్యాణ్‌ ఎపిసోడ్ వచ్చే చాన్స్‌లు ఉన్నాయి. ఇక వచ్చే సీజన్‌లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లను కలిపి బాలయ్య తీసుకొస్తాడనే టాక్ ఇంకో సైడ్ ప్రచారం జరుగుతోంది.


Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్


Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి