Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్ కు పెరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ  స్థాయిలో నిర్వహించే పలు ఈవెంట్స్ కు రామ్ చరణ్ కు ప్రత్యేక ఆహ్వానాలు అందిన సంగతి తెలిసిందే కదా. అటు అంబానీ ఇంట పెళ్లికి తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి మొదటగా ఆహ్వానం అందుకుంది మెగా పవర్ స్టార్ అనే చెప్పాలి. అంతేకాదు అనంత్ అంబానీతో రామ్ చరణ్ మధ్య మంచి దోస్తి కుదిరింది. అది పెళ్లిలో కనిపించింది. ఆ సంగతి పక్కన పెడితే.. రామ్ చరణ్ కు ‘ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లో జరిగే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్ అవార్డుతో గౌరవించనుంది. మన దేశం నుంచి ఈ అవార్డు అందుకోబోతున్న తొలి భారతీయ నటుడు రామ్ చరణే కావడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రీసెంట్ గా తమిళనాడులోని ప్రముఖ యూనివర్సిటీ రామ్ చరణ్ ను గౌరవ డాక్టరేట్ తో సత్కరించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు త్వరలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని లండన్ లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక రామ్ చరణ్ అందుకోబోతున్న అవార్డు విషయానికొస్తే.. ది ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్(ఐఎఫ్ఎఫ్ఎం) 15 ఎడిష‌న్‌కు గెస్ట్ ఆఫ్ హాన‌ర్ అవార్డును గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అందుబోతున్నారు.  మెల్‌బోర్న్‌లో జ‌ర‌గ‌నున్న ఈ ఇండియ‌న్ సినీ అవార్డుల‌కు రామ్ చ‌ర‌ణ్ త‌న స్టార్ పవ‌ర్‌ను జోడిస్తున్నారు. ఈ వేడుకకు అక్కడ ఎన్నారైలతో పాటు తెలుగు వాళ్లు కూడా భారీ సంఖ్యలో హాజరు కానున్నారు.  




భార‌తీయ చ‌ల‌న చిత్ర పరిశ్ర‌మలో విజయ పరంపరతో  రామ్ చ‌ర‌ణ్ ప్రేక్ష‌కుల గుండెల్లో సుస్థిర‌మైన స్థానాన్ని ద‌క్కించుకున్నారు. IFFM అనేది ఆస్ట్రేలియాలోని విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే అధికారిక చలనచిత్రోత్సవం. ఈ వేడుక‌లు ఆగష్టు  15 నుంచి 25 వరకు 11 రోజుల పాటు జరగున్నాయి.


రామ్ చరణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ఈ యేడాదే విడుదలయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు బుచ్చిబాబు సన దర్శకత్వంలో జాన్వీ కపూర్ తో కలిసి నటిస్తోన్న 16 చిత్రం వచ్చే యేడాది దసరా కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమా రంగస్థలం మూవీ మాదిరి పూర్తి గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్టు సమాచారం. దీంతో పాటు పలు ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రామ్ చరణ్ త్వరలో ప్రకటించనున్నారు.


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook