Acharya movie shooting: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. RRR shooting లో రీసెంట్ షెడ్యూల్ ముగించుకున్న రాంచరణ్.. ప్రస్తుతం ఆచార్య షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. డాడీ చిరంజీవితో కలిసి Acharya shooting ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్.. ఇదే విషయాన్ని ట్విటర్ ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు. డాడీ చిరుతో కలిసి ప్రతీక్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు తన ట్వీట్‌లో పేర్కొన్న చరణ్.. ఏ కామ్రేడ్ మూమెంట్ అంటూ తన ట్వీట్‌కి క్యాప్షన్ కూడా పెట్టాడు. దీంతో చరణ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే సమయంలో Director Koratala Siva సైతం అదే ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ, ఆచార్య 'సిద్ధ'మవుతున్నాడు అని అభిమానులను టీజ్ చేశాడు. కొరటాల శివ చేసిన ఈ ట్వీట్ చూసిన నెటిజెన్స్.. ఈ సినిమాలో చెర్రీ పాత్ర పేరు సిద్ధ అని కొరటాల శివ చెప్పకనే చెబుతున్నాడు అని కామెంట్ చేసుకుంటున్నారు. 

రామ్ చరణ్ హోమ్ ప్రొడక్షన్స్ కొనిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాటినీ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న Acharya movie లో మెగాస్టార్ Chiranjeevi సరసన Kajal Aggarwal ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.