Game Changer Release Date: రామ్ చరణ్ హీరోగా.. దిల్ రాజు నిర్మిస్తూ.. శంకర్ దర్శకత్వంలో రానున్న సినిమా గేమ్ చేంజెర్. దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ మధ్యనే ఈ చిత్ర షూటింగ్ ముగిసింది అని.. సినిమా యూనిట్ చెప్పుకొచ్చారు. అయితే కనీసం రామ్ చరణ్ అభిమానులు హమ్మయ్య అనుకునే టైం కూడా ఇవ్వకుండా.. కొద్దిరోజుల తర్వాత ఈ చిత్రం కొంచెం పెండింగ్ షూటింగ్ మొదలుకానుంది అని మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో రామ్ చరణ్ అభిమానులు తెగ నిరాశపడ్డారు. ముఖ్యంగా వరస హిట్లు అందుకుంటూ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా దూసుకుపోయిన శంకర్.. ఈ మధ్య మాత్రం వరస ప్లాపులు ఇస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ 2 సినిమా ఘోరపరాజయం చవిచూసింది. ఇక ఇండియన్ 2 సినిమా విడుదలైన దగ్గర నుంచి.. రామ్ చరణ్ అభిమానుల్లో మరింత భయం మొదలయ్యింది. శంకర్ తమ సినిమాని కూడా ఇలానే చేస్తారేమో అని.. తెగ భయపడుతున్నారు మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్..


ఈ క్రమంలో ఈ సినిమా నుంచి ఈరోజు వినాయక చవితి సందర్భంగా శంకర్ ఒక అప్డేట్ ఇచ్చారు. అదేమిటంటే ఈ చిత్రం సెకండ్ సింగిల్.. ఈనెల సెప్టెంబర్ లో విడుదల కానుంది అంటూ ఒక పోస్టర్ షేర్ చేశారు. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రం ఫస్ట్ సింగల్ జరగండి.. విడుదలయింది.  ఈ పాట ప్రేక్షకుల దగ్గర పరవాలేదు అనిపించుకుంది. ఇప్పుడు ఈ సెకండ్ సింగల్ ఎలా ఉంటుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు.


 



ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ పోస్టర్ చూశాక కూడా రామ్ చరణ్ అభిమానుల్లో నిరాశ తప్పలేదు. ఇందుకు ముఖ్య కారణం.. గత కొద్ది రోజుల క్రితమే దిల్ రాజు గేమ్ చేంజెర్ సినిమా తప్పకుండా డిసెంబర్లో విడుదల చేస్తాము అంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ షూటింగ్ ముగిసింది నిజమైన.. లేదా దిల్ రాజు మాటల్లో నిజం ఉన్నా కానీ.. ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో.. విడుదల తేదీ కూడా చిత్ర యోని ప్రకటించుంటారు. కానీ ఇప్పటికి కూడా ధైర్యంగా పోస్టర్లో విడుదల తేదీ చెప్పడం లేదంటే.. ఈ సినిమా క్రిస్మస్ కి కూడా వచ్చేది అనుమానమే అని.. అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మరి గేమ్ చేంజెర్ సినిమా థియేటర్లో చూసే అదృష్టం సినీ ప్రేక్షకులకు ఎప్పుడు దక్కుతుందో వేచి చూడాలి.


Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..! 


Also Read: Traffic Restrictions: ఖైరతాబాద్‌ వెళ్లే వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.