Pushpa 2 release date: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. కాంబినేషన్ లో.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా.. పుష్ప 2. 2021లో విడుదలై.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన.. పుష్ప సినిమాకి రెండవ భాగంగా ఈ చిత్రం.. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 6వ.. తేదీన.. థియేటర్లలో విడుదలకి సిద్ధం అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆగస్టు నుంచి వాయిదా పడి.. డిసెంబర్ లో.. విడుదల కాబోతున్న.. ఈ సినిమా వల్ల అప్పటికే డిసెంబర్ లో విడుదల కావాల్సిన సినిమాలు.. వాయిదా వేయాల్సి వస్తోంది. ఇప్పటికే నితిన్ రాబిన్ హుడ్ రిలీజ్ ను.. డిసెంబర్ బరిలో నుంచి తప్పించాడు. నాగచైతన్య కూడా తండెల్ సినిమాని.. వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఉన్న సినిమాలే వాయిదా పడుతున్నాయి అంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం.. తన గేమ్ చేంజర్ సినిమాని.. అదే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 


తాజా సమాచారం ప్రకారం.. శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్, శరవేగంగా జరుగుతుంది. ఇంకా ఒక్కరోజు షూటింగ్ చేస్తే.. రామ్ చరణ్.. పాత్రకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయిపోతుందట. మిగతా నటీనటులతో.. ఒక పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ షూటింగ్ తర్వాత నిర్మాణాంతర పనులు కూడా పూర్తయిపోతే.. సినిమా విడుదల చేయొచ్చు. ముందు దీపావళి కానుకగా సినిమాని విడుదల చేస్తే బాగుంటుందని చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు సినిమాని డిసెంబర్ లో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తాందట. 


డిసెంబర్ 20వ తేదీన రామ్ చరణ్.. గేమ్ చేంజర్ సినిమా.. విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. 


ఇప్పటికే మెగా అల్లు కుటుంబాల మధ్య వివాదం.. రోజురోజుకీ ముదిరిపోతుంది. ఈ సమయంలో రామ్ చరణ్ కూడా అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా సినిమాని.. విడుదల చేస్తే ఆ ప్రభావం.. అభిమానుల మీద కూడా ఉంటుంది. ఇరు వర్గాల అభిమానులు సోషల్ మీడియాలో.. ఇంకా భారీ స్థాయిలో కొట్టుకునే అవకాశం ఉంది. ఏదేమైనా సినిమా విడుదల తేదీకి సంబంధించిన.. అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.


Also Read: O Manchi Ghost: థియేటర్లకు రండి.. హాయిగా నవ్వుకుని వెళ్లండి: OMG మూవీ టీమ్


Also Read: Bharatheeyudu 2: కమలహాసన్ పరిస్థితి ఇలా అయింది ఏమిటి..? భారతీయుడు 2 థియేట్రికల్ బిజినెస్ పై నీలి నీడలు.. ?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter