Ram Charan Gold Coin: ఇటీవలే విడుదలైన 'ఆర్ఆర్ఆర్' సినిమా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రభంజనం కనిపిస్తుంది. ఉత్తర భారతంలో ఊహించని స్పందన రావడం, అక్కడ వసూళ్లు మరింత స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల 'ఆర్ఆర్ఆర్' మూవీ కలెక్షన్లలో దూసుకుపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 'ఆర్ఆర్ఆర్' సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 రోజుల్లో రూ.700 కోట్లకుపైగా కలెక్షన్లు..


ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేసి నయా రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం ఇంత సక్సెస్ కావడం వల్ల ఒకపక్క హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సహా సినిమాలో భాగమైన అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


ఆర్ఆర్ఆర్ టీమ్ కు చరణ్ స్పెషల్ గిఫ్ట్


ఆర్ఆర్ఆర్ చిత్రానికి విపరీతమైన క్రేజ్ వచ్చిన నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మంచి తనాన్ని చాటుకున్నారు. సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను ఆదివారం (ఏప్రిల్ 3) ఉదయం అల్పాహారం కోసం పిలిపించి వారందరికీ ఊహించని బహుమతి అందించారు. 



ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందిని ఇంటికి అల్పాహారం కోసం పిలిపించారు. 


వారితో కాస్త సమయం గడిపిన రామ్ చరణ్ అనంతరం వారందరికీ ఒక్కొకరికి ఒక్కో తులం బంగారం కాయిన్ కానుకగా ఇవ్వడమే కాక వారికి ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించి సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా రామ్ చరణ్ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 


Also Read: Janhvi Kapoor Photos: షైనింగ్ డ్రస్సులో వజ్రంలా మెరిసిపోతున్న నటి జాన్వీ కపూర్!


Also Read: Sai Pallavi Farming: కూలీగా మారిన 'శ్యామ్ సింగరాయ్' మూవీ హీరోయిన్ - ఫొటోలు వైరల్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook