Ram Charan New Party: జనసేనకు షాక్.. కొత్త పార్టీ నుంచి పోటీ చేస్తున్న రామ్ చరణ్?
Ram Charan at Abhyudayam Party: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న శంకర్ సినిమా నుంచి ఒక షూటింగ్ ఫోటో లీక్ అయింది, అందులో ఆయన అభ్యుదయం పార్టీ అభ్యర్ధిగా కనిపిస్తున్నారు. ఆ వివరాలు
Ram Charan in Abhyudayam Party: ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ ఎలాంటి సబ్జెక్ట్ చేస్తాడు అని అందరూ ఆసక్తి చూపించారు. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన వెంటనే ఆయన ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అందుకున్నారు. ప్రస్తుతానికి రాంచరణ్ తన కెరీర్ లో 15వ సినిమాలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద రాంచరణ్ అభిమానులు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులందరూ విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు.
భారీ చిత్రాలకు పేరు తెచ్చుకున్న శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండడం ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్, పాన్ ఇండియన్ స్థాయి మూవీ తర్వాత రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో సినిమా మీద ప్రేక్షకులందరిలో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోతున్నాయి. దానికి తోడు ఈ సినిమాలో శ్రీకాంత్, కియారా అద్వానీ, అంజలి వంటి వారు కూడా నటిస్తూ ఉండడంతో ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ప్రేక్షకులందరూ భావిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమాని అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ పలు భిన్నమైన పాత్రలో కనిపిస్తాడని ముందు నుంచి ప్రచారం జరుగుతుంది. గతంలో ఆయన సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్న కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, ఇప్పుడు తాజాగా రాంచరణ్ తేజ ఈ సినిమా కోసం చార్మినార్ వద్ద షూటింగ్ చేస్తున్నారు. ఆ షూటింగ్ నుంచి ఒక ఆసక్తికరమైన ఫోటో లీక్ అయింది. ఆ ఫోటోలో రామ్ చరణ్ తేజ అభ్యుదయం పార్టీ అనే ఒక పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థిగా కనిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా కూడా తెరకెక్కుతుందని ఈ ఫోటోతో క్లారిటీ వచ్చినట్టు అయిందని కొందరు చెబుతున్నారు.
తన బాబాయ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి రాంచరణ్ ఎప్పటికప్పుడు తన సపోర్ట్ అందిస్తానని చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేనకు లబ్ధి కలిగించేలా ఈ సినిమా ఉండబోతుంది అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే శంకర్ ఈ సినిమాని పీరియాడిక్ మూవీగా తెరకెక్కిస్తున్నారని గతంలో ఛానాళ్ల క్రితమే జరిగిన విషయాన్ని సినిమాలో చూపించబోతున్నారు కాబట్టి జనసేనకు ఈ పార్టీకి ఏమాత్రం సంబంధం ఉండే అవకాశాలు లేవని అంటున్నారు. దీంతో రామ్ చరణ్ సినిమాతో జనసేనకి ఏమైనా ఉపయోగపడుతుందని భావించిన వారందరికీ ఒక రకంగా అది షాక్ అనే చెప్పాలి. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.
Also Read: Anchor Shyamala Saree Photos: చీరకట్టులో కవ్విస్తున్న యాంకర్ శ్యామల.. కొంచెం ఎక్కువైంది అంటూ!
Also Read: Bandla Ganesh on Pawan: పవన్ విషయంలో మాట మార్చిన బండ్ల గణేష్..అవమానపరిచినా ఆభరణంగా ఫీలవ్వాలి అంటూ !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook