Ram Charan Indirect Comments on Acharya goes Viral: ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత తన తండ్రితో కలిసి చేసిన ఆచార్య సినిమాతో మాత్రం భారీ డిజాస్టర్ అందుకున్నాడు. వాస్తవానికి ముందుగా రామ్ చరణ్ ది చిన్న పాత్ర అనుకున్నా ఆ తరువాత ఎందుకో కానీ ఆ పాత్ర పరిధి భారీగా పెంచారు. ఇక ఆ సినిమా విడుదలైన తర్వాత చాలా పెద్దదిగానే ఉందని ప్రేక్షకులకు అర్థమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ సొంత ప్రొడక్షన్ అలాగే మ్యాంటీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. అయితే ఊహించిన మేర అంచనాలను అందుకోలేక పోవడంతో ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా మీద ఇప్పుడు రాంచరణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన అక్షయ్ కుమార్ తో కలిసి కనిపించారు.


ఇక ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ ప్రేక్షకులు సినిమా చూసే పద్ధతి మారిపోయిందని ఖచ్చితంగా కంటెంట్ ఉందని వారు నమ్మితేనే సినిమా ధియేటర్లకు వస్తున్నారని చెప్పారు. ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కూడా తాను ఒక చిన్న గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన సినిమా రిలీజ్ అయిందని అయినా సరే ప్రేక్షకులను ఆ సినిమా థియేటర్లకు రప్పించడంలో విఫలమైందని పేర్కొన్నారు.


అయితే రామ్ చరణ్ ఇలా కామెంట్ చేయడం ఏమాత్రం బాలేదని సినీ విమర్శకులు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకరకంగా చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ గా ఆచార్య సినిమా చూసిన అందరికి అర్ధం అవుతుంది. కానీ ఇప్పుడు రామ్ చరణ్ ఒక చిన్న అతిథి పాత్ర చేశానని చెప్పడం ఏమాత్రం బాలేదని ఇది తన ఫెయిల్యూర్ ని కవర్ చేసుకునేందుకే చెప్పినట్లుగా అనిపిస్తోందని అంటున్నారు.


ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ 15 పేరుతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం నుంచి ఇంగ్లాండ్లో జరగబోతుందని ఇదే ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పేర్కొన్నారు .ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం అధికారిక క్లారిటీ లేదు. కానీ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచారం అయితే ఉంది.


Also Read: Chiru Vs Balayya: అన్ని విషయాల్లో బాలయ్యను డామినేట్ చేస్తున్న చిరు.. ఆ దెబ్బతో సినిమా కూడా ముందే?


Also Read: Samantha Hugs: అతని కౌగిట్లో సమంత.. ఈరోజు వస్తుందని ఊహించలేదంటూ పోస్ట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook