Ram Charan Naatu Naatu: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సినిమాలో రూపొందించిన నాటు నాటు అనే సాంగ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరినీ ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమ వైపు చూసేలా చేసింది. ఈ సాంగ్లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి ఒకే సింక్లో డాన్స్ చేయడమే కాక ఆ ట్యూన్స్ కూడా ప్రేక్షకులందరికీ బాగా నచ్చేశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కీరవాణి స్వరపరిచిన ఈ సాంగ్ ను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కలిసి ఆలపించారు. ఇక ఈ సాంగ్ ఆస్కార్ అకాడమీ అవార్డులకు కూడా నామినేట్ అవ్వడంతో కచ్చితంగా ఆస్కార్ అవార్డు తీసుకొస్తుందని అందరూ భావిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తాజాగా పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కలిసి నాటు నాటు సాంగ్ కి కాలు కలిపారు. అసలు విషయం ఏమిటంటే హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.


ఈ కార్ రేసింగ్ కోసం ఆనంద్ మహీంద్రా కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఈ కార్ రేసింగ్ చూసేందుకు అక్కడికి వెళ్లిన రాంచరణ్ ఆనంద్ మహీంద్రా తో కాసేపు సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆనంద్ మహీంద్రా సరదాగా నాటు నాటు సాంగ్ కి కాలు కలపమని అడిగితే రామ్ చరణ్ కూడా కాదనలేక  ఆనంద్ మహీంద్రాతో కలిసి నాటు నాటు స్టెప్ వేశారు. ఇక ఈ స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


ఈ సందర్భంగా ఈ విషయాన్ని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా రామ్ చరణ్ కి థాంక్స్ చెప్పడమే కాక త్వరలోనే ఆస్కార్సులో ఈ సాంగ్ అవార్డు అందుకోవాలని కూడా ఆయన అభిలాష వ్యక్తం చేశారు. ఇక రాంచరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికొస్తే ఆయన 15వ సినిమా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. మరో పక్క అయిన 16వ సినిమాని కూడా అనౌన్స్ చేశారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో కొత్త నిర్మాణ సంస్థ ఈ సినిమాని తెరకెక్కిస్తోంది.


Also Read: Varshini Sounderajan Hot: పొట్టి బట్టల్లో వర్షిణి రచ్చ... ఫోటోలు చూశారా?


Also Read: Samantha Update: సమంత హెల్త్ అప్డేట్ ఇచ్చేసింది.. ఇప్పుడు ఆరోగ్యపరిస్థితి ఎలా ఉందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook