Ram Charan: రామ్ చరణ్ కొత్త కారు ఖరీదు.. ఏకంగా అన్ని కోట్లు!
Ram Charan New Car: రామ్ చరణ్ కొత్త రోల్స్ రాయ్స్ స్పెక్టర్ కారు ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. అంబానీ ఇంట్లో పెళ్లి.. కోసం రామ్ చరణ్ ముంబైకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భార్య ఉపాసనతో కలిసి బేగంపేట్ ఎయిర్ పోర్టులో కనిపించారు చెర్రీ. రోల్స్ రాయ్స్ స్పెక్టర్ మోడల్ కార్ నుండి చరణ్ రాయల్‌గా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కారు హైదరాబాద్‌లో మొదటిసారిగా వాడుతున్నది రామ్ చరణ్. ఈ కార్ ఖరీదు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.
Ram Charan Rolls Royce Cost: ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబాని, రాధిక మర్చంట్ ల పెళ్లికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన కుటుంబ సభ్యులతో పాటు.. పెళ్లి కోసం ముంబై బయలుదేరారు. బేగం పేట ఎయిర్పోర్ట్ వద్ద రామ్ చరణ్ తన భార్య ఉపాసన, కూతురు క్లీన్ కారాతో.. సరికొత్త రోల్స్ రాయిస్ కార్ నుండి దిగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అతి కాస్ట్లీ కార్లలో ఒకటైన ఈ కారు ప్రపంచం మొత్తం మీద చాలా అరుదుగా కనిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశం మొత్తం.. మీద ఇది రెండో కారు. ఇక హైదరాబాద్ సంగతికి వస్తే ఈ మహానగరంలో ఇదే మొదటి కారు కావడం విశేషం.
హైదరాబాద్ మొత్తం మీద రామ్ చరణ్ వద్ద మాత్రమే ఈ కారు ఉంది. దీని ధర అక్షరాల ఏడున్నర కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. దీంతో ఈ కారు ధర.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరికీ.. షాక్ ఇస్తుంది. అలాంటి కారు నుంచి రామ్ చరణ్ తన భార్య కూతుర్లతో దిగడం ఇప్పుడు సంచలనం సృష్టించింది.
దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రామ్ చరణ్ కారు ధర గురించి అన్నిచోట్ల చర్చ.. జరుగుతుంది. గ్లోబల్ స్టార్ గా మారిపోయిన.. రామ్ చరణ్ టాలీవుడ్ లో అధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఒకరు.
జూలై 12 నుంచి 14 వరకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహ ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. , బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్‌లో జరగనున్న ఈ వేడుకల కోసం ముఖేష్ అంబానీ వేల కోట్ల.. రూపాయలను ఖర్చు చేస్తున్నారు. సౌత్ నుండి మాత్రమే కాక నార్త్ నుండి కూడా చాలా మంది సెలబ్రిటీలు ఈ వేడుక లో పాలు పంచుకుంటున్నారు. టాలీవుడ్ నుంచి తక్కువ సంఖ్యలో అతిథులు ఉన్నారు. అందులో రామ్ చరణ్ కూడా ఒకరు.
ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ తన కుటుంబంతో పాటు అంబానీ పెళ్లి వేడుకల్లో.. సందడి చేయబోతున్నారు. ఇంతకుముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా రామ్ చరణ్ పాలుపంచుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీ సల్మాన్ ఖాన్ తో కలిసి నాటు నాటు.. పాటకి రామ్ చరణ్ డాన్స్ వేయడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: Raj Tarun: న్యాయం కోసం పవన్ కళ్యాణ్ ని కలుస్తాను.. రాజ్ తరుణ్ మాజీ లవర్ ఆవేదన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి