Ram Charan RC 16- Janhvi Kaporr: రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్.. అఫీషియల్ ప్రకటన..

Ram Charan - RC 16 - Janhvi Kapoor: రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మూవీలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తున్నట్టు అఫిషియల్‌గా ప్రకటించారు.
Ram Charan - RC 16 - Janhvi Kapoor: రాజమౌళి డైరెక్షన్‌లో తెరరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మూవీతో రామ్ చరణ్ ప్యాన్ ఇండియా లెవల్లోనే కాదు.. గ్లోబల్ లెవల్లో పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా ఒదిగిపోయాడు. ఈ సినిమా తర్వాత చేయబోయే ప్రతి సినిమాను గ్లోబల్ లెవల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంచర్' మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో నెక్ట్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో రామ్ చరణ్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా కాబట్టి ఈ సినిమా హీరో క్యారెక్టర్‌తో పాటు కథానాయిక పాత్రకు మంచి స్కోప్ ఉంది. అందుకే ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటిస్తున్నట్టు జాన్వీ తండ్రి బోనీ కపూర్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్ చెప్పారు. ఈ రోజు జాన్వీ కపూర్ బర్త్ డే సందర్బంగా చిత్ర యూనిట్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు అఫిషియల్‌గా ప్రకటించారు. జాన్వీ... ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం రెండు పార్టులుగా రానుంది. ఫస్ట్ పార్ట్ ఈ యేడాది ఏప్రిల్‌లో అనుకున్నారు. కానీ షూటింగ్ లేట్ కావడంతో ఈ మూవీని అక్టోబర్ 10కి రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసారు.
అటు రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ పెయిర్ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలో జాన్వీ కపూర్ పై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారట. రామ్ చరణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో రామ్ చరణ్ ప్రభుత్వ అధికారి నుంచి ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ తొలిసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. అటు రామ్ చరణ్ ప్యాన్ ఇండియా లెవల్లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ పినిమా డిసెంబర్ 25న ఇయర్ ఎండింగ్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
Also read: Tax Free Incomes: ఈ 5 రకాల ఆదాయాలపై ట్యాక్స్ ఉండదని మీకు తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook