Ram Charan - Nayak Movie Re Release: గత కొన్ని రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ మూవీస్ ట్రెండ్ ఎక్కువపోయింది. లాస్ట్ ఇయర్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఫ్లాప్ మూవీ 'ఆరెంజ్' మళ్లీ విడుదల చేస్తే థియేటర్స్‌లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇపుడు రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'నాయక్' మూవీని ఆయన బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నిర్మాత డీవివి దానయ్య నిర్మించారు. తమన్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమాలో చిరు సూపర్ హిట్ కొండవీటి దొంగలోని 'శుభలేఖ రాసుకున్న' పాటను రీమిక్స్ చేసారు. ఈ పాటనకు అప్పట్లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరన కాజల్ అగర్వాల్, అమలా పాల్ నటించారు. మగధీర తర్వాత రామ్ చరణ్‌ సరసన కాజల్ నటించిన రెండో చిత్రం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక 'మగధీర' తర్వాత రామ్ చరణ్ పూర్తి స్థాయిలో డ్యూయల్ రోల్లో నటించిన సినిమా 'నాయక్'. ఈ సినిమాలో నాయక్‌గా.. చెర్రీగా రెండు పాత్రల్లో ఒదిగిపోయాడు చరణ్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ విడుదల చేస్తున్నారు. రీసెంట్‌గా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాను రీ రిలీజ్ చేసారు. తాజాగా ఇపుడు రామ్ చరణ్ నటించిన 'నాయక్' మూవీని రామ్ చరణ్ బర్త్ డే కానుకగా 4Kలో రీ రిలీజ్ చేస్తున్నాడు.


ఈ నెల 27 రామ్ చరణ్ బర్త్ డే. ఆ డేట్‌కు ఒక వీక్ ముందు ఈ సినిమాను మార్చి 23న 'నాయక్' మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. యాక్షన్ కమ్ కామెడీ ఎంటర్టైనర్‌గా వివి వినాయక్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాను 2013 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలై సంచలన విజయం సాధించింది. రూ. 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా అప్పట్లో రూ. 65 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాదాపు 11 యేళ్ల తర్వాత రీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందా లేదా అనేది చూడాలి.


Also read: Tax Free Incomes: ఈ 5 రకాల ఆదాయాలపై ట్యాక్స్ ఉండదని మీకు తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook