Ram Charan, Upasana Kamineni With Their Daughter: మెగా ఫ్యాన్స్.. ఎస్పెషల్లీ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫోటోలు రానే వచ్చాయి. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని డెలివరీ అయిన తరువాత తొలిసారిగా శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే క్రమంలో ఇద్దరూ కలిసి తమ పండంటి బిడ్డతో మీడియా కెమెరాలకు ఫోజిచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ అభిమానుల సోషల్ మీడియా పేజీలన్నీ చరణ్ గారాలపట్టి ఫోటోలు, వీడియోలతోనే నిండిపోయాయి. రామ్ చరణ్ కూతురి ఫోటోలను అభిమానుసు షేర్ చేసుకుంటుండంతో నేడు రామ్ చరణ్ బిడ్డే క్వీన్ ఆఫ్ ది సోషల్ మీడియా అయ్యింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ బిడ్డను ఎత్తుకుని అపోలో ఆస్పత్రి నుంచి బయటికి రాగానే అభిమానులు వారిపై పూల వర్షం కురిపించడం ఈ ఫోటోల్లో, వీడియోల్లో చూడవచ్చు. అంతేకాకుండా తమ స్టార్ హీరో గారాలపట్టిని తమ కెమెరాల్లో బంధించడానికి సైతం అభిమానులు పోటీపడ్డారు. 


[[{"fid":"276325","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ram Charan, Upasana Kamineni With Their Daughter","field_file_image_title_text[und][0][value]":"Ram Charan, Upasana Kamineni With Their Daughter"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ram Charan, Upasana Kamineni With Their Daughter","field_file_image_title_text[und][0][value]":"Ram Charan, Upasana Kamineni With Their Daughter"}},"link_text":false,"attributes":{"alt":"Ram Charan, Upasana Kamineni With Their Daughter","title":"Ram Charan, Upasana Kamineni With Their Daughter","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఉపాసన జూన్ 20న హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. శిశువు, తల్లి ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు అని ఆరోజే అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం ఒక హెల్త్ బులెటిన్ ద్వారా ప్రకటించింది.  


ఇదిలావుంటే, రామ్ చరణ్, ఉపాసన దంపతుల కూతురి ఫోటోలు, వీడియోలు ఇదిగో అంటూ గత రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఏవేవో నకిలీ ఫోటోలు, నకిలీ వీడియోలు వైరల్ అవుతూ వచ్చాయి. వాటన్నింటికీ రామ్ చరణ్, ఉపాసన దంపతులు చెక్ పెడుతూ వారే అధికారికంగా తమ బిడ్డతో సహా నేడు మీడియా ముందుకొచ్చేశారు. 


[[{"fid":"276326","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ram Charan, Upasana Kamineni photos With Their Daughter photo","field_file_image_title_text[und][0][value]":"Ram Charan, Upasana Kamineni photos With Their Daughter "},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ram Charan, Upasana Kamineni photos With Their Daughter photo","field_file_image_title_text[und][0][value]":"Ram Charan, Upasana Kamineni photos With Their Daughter "}},"link_text":false,"attributes":{"alt":"Ram Charan, Upasana Kamineni photos With Their Daughter photo","title":"Ram Charan, Upasana Kamineni photos With Their Daughter ","class":"media-element file-default","data-delta":"2"}}]]


మూడు రోజుల క్రితం ఉపాసన కొనిదెల డెలీవరి అయిన రోజున చిరంజీవి ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. పట్టరానంత సంతోషాన్ని వ్యక్తంచేశారు. రామ్ చరణ్ బిడ్డను లిటిల్ మెగా ప్రిన్సెస్ అని అభివర్ణించిన చిరంజీవి.. నీ రాకతో లక్షల మందితో కూడిన మెగా కుటుంబంలో ఆనందం నిండింది అని ట్వీట్ చేశారు. 



ఇది కూడా చదవండి : Bhari Taraganam Review: భారీ తారాగణం మూవీ రివ్యూ.. కామెడీ & లవ్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే..?


రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పెళ్లయి 11 ఏళ్లు అవుతోంది. ఇటీవలే.. అంటే జూన్ 14నే తమ వివాహ వార్షికోత్స మహోత్సవాన్ని జరుపుకున్న రామ్ చరణ్, ఉపాసన కొనిదెల దంపతుల జీవితాల్లోకి ఆ తరువాత వారం కూడా తిరక్కముందే లిటిల్ మెగా ప్రిన్సెస్ ఎంట్రీ ఇవ్వడం నిజంగా విశేషమే కదా.


ఇది కూడా చదవండి : Kantara 2 Update: 'కాంతార 2' కోసం ఆ రెండు నేర్చుకుంటున్న రిషభ్ శెట్టి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK