Ram Charan, Upasana twin in white during their 10th wedding anniversary vacation: టాలీవుడ్ స్టార్ కపుల్‌లలో రామ్‌ చరణ్‌, ఉపాసన జోడి ఒకటి. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. చరణ్‌ ఫ్యామిలీ కోసం టైమ్ కేటాయిస్తాడు.  సతీమణి ఉపాసనతో కలిసి తరచూ వెకేషన్‌కు వెళుతుంటాడు. మంగళవారం (జూన్‌ 14) చరణ్‌, ఉపాసన పదవ వెడ్డింగ్‌ యానివర్సరీ. ఈ  సందర్భంగా Rc 15కి కాస్త గ్యాప్ ఇచ్చిన చరణ్..  ఉపాసనతో కలిసి ఇటీవల ఇటలీ టూర్‌కు వెళ్ళాడు. ఈ స్టార్ జంట ఇటలీలో చక్కర్లు కొడుతూ.. అక్కడి అందాలను ఎంజాయ్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రేపు వెడ్డింగ్‌ యానివర్సరీ సందర్భంగా సోమవారం రామ్‌ చరణ్‌, ఉపాసన ఒకే రంగు దుస్తులు ధరించిన ఓ ఫొటోను షేర్‌ చేశాడు పవర్ స్టార్. చూట్టూ పచ్చిన చెట్లు, గార్డెన్‌ మధ్యలో ఇద్దరు తెలుగు రంగు దుస్తులు ధరించి ఒకరినొకరు చూసుకుంటు దిగిన ఈ ఫొటోని చరణ్  తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దీనికి స్మైలీ ఎమోజీని కూడా జత చేశాడు. ఈ ఫొటో చూసి మెగా ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ జంటకు అడ్వాన్స్‌గా మ్యారెజ్‌ యానివర్సరీ శుభాకాంక్షలు చెపుతున్నారు.


రామ్‌ చరణ్‌, ఉపాసనలు 2012 జూన్‌ 14న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారి వివాహా బంధానికి పదేళ్లు నిండటంతో.. ఇలా స్పెషల్‌గా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఓ వారం పాటు చరణ్, ఉపాసనలు అక్కడే ఉండబోతోన్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చరణ్ చాలా రోజుల తరువాత ఫ్యామిలీ వెకేషన్‌కు వెళ్ళాడు. ఆ మధ్య  షూటింగ్‌ల కోసం చరణ్ వెళ్తే.. అతనితో పాటుగా ఉపాసన వెళ్లేది. ఇప్పుడు ఇలా స్పెషల్ ట్రిప్ వేశారు.


సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్‌ 'ఆర్‌సీ 15' మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ప్రముఖ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చెర్రికి జోడిగా బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోంది. ఆ తరువాత గౌతమ్ తిన్ననూరితో చరణ్  సినిమా ఖరారు అయింది. ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్ వంటి ప్రముఖ దర్శకులతోనూ సినిమాలు చేయబోతోన్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.


Also Read: Kethika Sharma: కేతిక శ‌ర్మ‌కు బంపర్ ఆఫర్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా!


Also Read: IPL Media Rights: భారీ ధరకు అమ్ముడుపోయిన ఐపీఎల్ మీడియా రైట్స్.. ఈసారి ఏ కంపెనీకో తెలుసా?  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.