Jr NTR:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూనియర్ ఎన్టీఆర్.. పేరుకు నందమూరి వారసుడైనప్పటికీ ఇండస్ట్రీలో అతని ఎంత ఒంటరిగా ఉన్నాడో అందరికీ తెలిసిన విషయమే. మెల్లిగా తన కెరీర్ ని బిల్డ్ చేసుకుంటూ తారక్ ఒంటరిగానే ఎదిగాడు. అయితే మరోపక్క రామ్ చరణ్ పరిస్థితి అది కాదు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మెగా వారసుడు.. చిరంజీవి కొడుకు.. దీంతో మొదటి నుంచి అతనికి ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత వరల్డ్ వైడ్ రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కి కూడా అదే రేంజ్ గుర్తింపు వచ్చింది.


అయితే ఆ తర్వాత పరిస్థితులు కాస్త అటు ఇటుగా కనిపిస్తున్నాయి. కరెక్ట్ గా ప్లాన్ చేసినట్లయితే ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రం ఏప్రిల్ 5కి విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఈ నెలాఖరికి వార్ 2 షూటింగ్ లో పాల్గొంటారు. నిజం చెప్పాలి అంటే తారకు డేట్స్ కోసం బాలీవుడ్ ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది. అంత క్రేజ్ తారక్ కి ఉన్నప్పటికీ.. ఆ క్రేజ్ అతని పబ్లిసిటీలో కనిపించడం లేదు .


దేవర మూవీ విడుదల అక్టోబర్ కి వాయిదా పడింది. తారక్ సోలో హీరోగా నటించిన లాస్ట్ చిత్రం అరవింద సమేత…2018 లో విడుదలైన ఈ మూవీ తర్వాత తిరిగి ఇప్పటివరకు తారక్ నుంచి సోలో చిత్రం లేదు.ఆర్ఆర్ఆర్ పుణ్యమా అని 3 సంవత్సరాలు తారక్ మరొక సినిమా చేయలేదు. ఆ మూవీ ఫినిష్ అయిన వెంటనే కూడా నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేయలేదు. కొరటాల మూవీ కోసం అతను సుమారు సంవత్సరం పాటు ఎదురు చూశారు.


గత ఏడాది సెట్స్ పైకి వెళ్ళిన దేవర షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది . తారక్ తో పాటు రామ్ చరణ్ కూడా సోలో మూవీ చేసి చాలా కాలం అవుతుంది. కానీ రామ్ చరణ్ విషయానికి వస్తే అతని పిఆర్ టీం ఎప్పటికప్పుడు పబ్లిసిటీలో ఎటువంటి లోపం లేకుండా చూసుకుంటుంది. పైగా అతనికి మెగా కాంపౌండ్ బ్యాకప్ కూడా ఉంది. దేవర మూవీ తర్వాత తారక్ చేస్తున్న నెక్స్ట్ మూవీ వార్ 2. ఈ మూవీ వల్ల తారక్ క్రేజ్ పెరుగుతుందా అంటే ఇది సోలో మూవీ కాదు మల్టీ స్టారర్. కాబట్టి క్రెడిట్ అందరికీ వెళ్తుంది కానీ సోలోగా ఎవరి ఖాతాలో పడదు.


త్వరలో రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం కూడా విడుదల కాబోతోంది. శంకర్ డైరెక్షన్ లో విడుదలవుతున్నాయి చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ ఫినిష్ అయ్యాక చరణ్ లైన్ అప్ లో భారీ చిత్రాలు ఉన్నాయని టాక్. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ జోరు పెంచకపోతే కష్టం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎన్టీఆర్ లైన్ అప్ లో కూడా మంచి సినిమాలే ఉన్నాయి. కానీ అవన్నీ విడుదల అవ్వడానికి ఎక్కువ సమయం పట్టేలా కనిపిస్తుంది. దీంతో మూవీ, స్టోరీ సెలక్షన్ దగ్గర నుంచి ప్రమోషన్స్ వరకు జూనియర్ ఎన్టీఆర్ మరింత శ్రద్ధ పెట్టాలి అని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.


Also Read: Harish Rao: రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలో రేపో ఎప్పుడూ కూలుతుందో..? హరీశ్ రావు సందేహం


Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్‌ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్‌: కేటీఆర్‌



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook