Ram Charan's role in Acharya movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ ముగించుకున్నాడు. 20 రోజుల పాటు జరిగిన ఆచార్య లేటెస్ట్ షెడ్యూల్లో రామ్ చరణ్, చిరంజీవిలపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌తో రామ్ చరణ్‌కి సంబంధించిన షూటింగ్ పార్ట్ దాదాపు ముగిసినట్టేనని తెలుస్తోంది. రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ షూటింగ్ ముగించుకున్న చరణ్, Rajamundry airport కి చేరుకుని అక్కడి Rajamundry - Hyderabad flight ద్వారా నుంచి హైదరాబాద్ వచ్చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ రావడం కోసం రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌కి చేరుకున్న రామ్ చరణ్‌ని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చెర్రీతో కలిసి ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. 


Also read : Saranga Dariya song meaning: సారంగ దరియా సాంగ్‌కి అర్థం ఏంటో చెప్పిన Suddala Ashok Teja


ఆచార్య సినిమా ద్వారా తొలిసారిగా చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి పూర్తి నిడివి కలిగిన పాత్రల్లో నటిస్తున్నారు. Koratala Siva డైరెక్ట్ చేస్తున్న Acharya movie కి మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. Kajal Aggarwal, Pooja Hegde ఫీమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook