Game Changer Song leak: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan), స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్(Shanker) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘'గేమ్‌ఛేంజర్‌'(Game Changer).  దిల్‌రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Adwani) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సాంగ్ లీకైనట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ఈ మూవీ మ్యూజికల్ అప్ డేట్ గురించి ఎదురుచూస్తున్నారు. ఆఫీషియల్ అనౌన్స్ రాకముందే పాట లీకవడంతో రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు సాంగ్ బాగుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పొలిటిక‌ల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, అంజలి, స‌ముద్రఖని, జ‌య‌రాయ్‌, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, సునీల్ తదితరులు కీ రోల్స్ లో నటించారు. కార్తీక్ సుబ్బరాజు కథను అందించగా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు మేకర్స్. 



Also Read: SIIMA Awards 2023: సైమా అవార్డ్స్‌ 2023.. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్.. బెస్ట్ మూవీ ఇదే..!


ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఈ సినిమా చిత్రీకరణ జరగట్లేదు. మరోవైపు శంకర్ కమల్‌హాసన్‌ ‘ఇండియన్‌ 2’చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ రెండు సినిమాల్లో ఏ మూవీ ముందుగా విడుదల అవుతుందనేది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఈ రెండు చిత్రాలపై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. 


Also read: Bigg Boss 7 Telugu: ట్విస్ట్ ఇవ్వనున్న బిగ్ బాస్.. ఈ వారం హౌస్ నుంచి వెళ్లేది అతడేనంట..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook