Ram Charan Siddha Teaser: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన మల్టీస్టారర్ ‘ఆచార్య’. ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో చిత్రబృందం జోరు పెంచేసింది. ఈ చిత్రంలోని రామ్ చరణ్ పాత్ర సిద్ధ కు సంబంధించిన టీజర్ ను మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్ లుక్స్ తో పాటు సిద్ధ పాత్ర చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా టీజర్ లోని చివరి షాట్ కు మెగా ఫ్యాన్స్ అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ సినిమాలో దేవాలయాల బాగు కోసం పాటుపడే పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారు. అలానే నక్సలైట్​ పాత్రలోనూ ఫ్యాన్స్ ను అలరించనున్నారు. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కథానాయకలుగా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు చిరు సతీమణి కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. మెలోడీ మాంత్రికుడు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.



ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ‘లాహే.. లాహే..’, ‘నీలాంబరి’ లిరికల్ సాంగ్స్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. నీలాంబరి పాటలో రామ్ చరణ్, పూజా హెగ్డే మధ్య కెమెస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.   


మరోవైపు రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కానుంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన మేకింగ్ గ్లింప్స్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కుతోంది. 



Also Read: బిగ్‌బాస్ సీజన్ 5 లో ఎలిమినేట్ అయింది యాంకర్ రవినా..పెరుగుతున్న ట్రోలింగ్


Also Read: Bandla Ganesh: బండ్ల గణేష్ గొప్ప మనసు-నేపాలి చిన్నారిని దత్తత తీసుకున్న నిర్మాత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook