Ram Gopal Varma Funny tweets on KA Paul: మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు దాదాపు తేటతెల్లం అయ్యాయి. అధికార టీఆర్ఎస్ మునుగోడు సీటును అధికారికంగా చేజిక్కించుకున్నట్లు అయింది. గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై తర్వాత బీజేపీలో చేరి మునుగోడు ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి సుమారు పదివేల కోట్ల మెజారిటీతో టిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇక ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేఏ పాల్ హడావిడి అంతా ఇంతా కాదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల షెడ్యూల్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక విధంగా కేఏ పాల్ కూడా వార్తల్లో నిలుస్తూనే వచ్చారు. మునుగోడులో గెలవబోయేది తానేనని రెండవ స్థానం మూడో స్థానం ఎవరు వస్తారో చూసుకోవాలంటూ ఎన్నికలకు ముందు పేర్కొన్న కేఏ పాల్ ఎన్నికల పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం అధికారులు బీజేపీ, టీఆర్ఎస్ కు తొత్తులుగా పనిచేశారు కాబట్టి తాను ఓడిపోయానని విమర్శించారు. ఇదిలా ఉండగా కేఏ పాల్ గురించి రాంగోపాల్ వర్మ పలు ఆసక్తికర ట్వీట్లు చేశారు.


ఇప్పుడే కేఏపాల్ తన స్నేహితులైన ఐఎస్ఐఎస్ అల్కాయిదా వంటి వారి సహాయం తీసుకుని మునుగోడు నియోజకవర్గం మీద బాంబులు వేయిస్తున్నాడని తెలిసింది, అక్కడివారు పారిపోవాలంటూ వర్మ పేర్కొన్నారు. అంతేకాక అతని శక్తి ఉపయోగించి ప్రభువుతో మునుగోడులో ఎలాంటి పంటలు పండకుండా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాడని ఒక దారుణమైన వైరస్ వచ్చి అక్కడ మనుషులు చనిపోయేలా జీసస్ తో కేఏ పాల్ కొన్ని చేయించబోతున్నాడని వెటకారం చేస్తూ ట్వీట్లు చేశారు.


ఇక్కడి నుంచి ఎలాగో తన్ని తరిమేశారు కాబట్టి ఇక కేఏ పాల్ అమెరికన్ ప్రెసిడెంట్ గా 2024లో పోటీ చేయడం బెటర్ అని అక్కడ అమెరికా ప్రెసిడెంట్ గా గెలిచిన తర్వాత మునుగోడు నియోజకవర్గం మీద ఒక న్యూక్లియర్ బాంబు వేస్తాడని వర్మ పేర్కొన్నారు. ఇక వర్మ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Arjun complaint: విశ్వక్ హ్యాండిచ్చాడు.. మంచు విష్ణుకు అర్జున్ ఫిర్యాదు!


Also Read: Brahmastra Streaming on OTT : ఓటీటీలో బ్రహ్మస్త్ర సినిమా.. రణ్‌బీర్ కపూర్‌ని అలియా భట్ ఎన్ని సార్లు పిలిచిందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook