RGV Sensational Tweet: `నేను చావాలన్న మీ కోరిక నెరవేరాలి`.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్!
RGV news: సంక్రాంతి సందర్భంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్ల సారాంశమేమిటంటే..
RGV Sensational Tweet: ప్రముఖ దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి ట్విట్టర్లో సంచలన కామెంట్స్ (RGV sensational tweets) చేశారు. సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలులు తెలుపుతూనే ఆయన చేసిన వరుస ట్వీట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
ఇంతకీ ట్వీట్లలో ఏముందంటే..
నన్ను ద్వేషించే వారందరికి హ్యాపీ సంక్రాంతి. నేను త్వరగా చావాలన్న మీ కోరికను దేవుడు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. అంటూ ఓ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ (RGV on his Haters) వర్మ.
ప్రతి వివాదంపై తనదైన శైలిలో స్పందించే రామ్ గోపాల్ వర్మ.. తనపై కూడా ఇలా ట్వీట్ చేయడం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ ట్వీట్‌కు ఆర్జీవీ ఫ్యాన్స్ భారీగా రెస్పాన్స్ అవుతున్నారు. మీరు అలా అనకండి.. మీ ఫ్యాన్స్ ఏమైపోతారు అంటూ రిప్లై ఇస్తున్నారు.
దేవుడిపై సెటైర్..
మరో ట్విట్లో దేవుడి సెటైర్ వేశారు ఆర్జీవీ.
మోహం చాటేస్తూ.. ఒక వైరస్ తర్వాత మరో వైరస్‌ను పంపి మమ్మల్ని హింసిస్తున్న దేవుడా నీకు హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు అని (RGV on God) రాసుకొచ్చారు.
చిన్న సినిమాలు పెద్ద హిట్ కొట్టాలి..
ఇంకో ట్వీట్లో.. చిన్న సినిమాలు నిర్మిచే వారికి హ్యాపీ సంక్రాంతి.. మీ సినిమాలన్ని బాహుబలికన్నా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అంటూ రాసుకొచ్చారు.
ఇక మరో ట్వీట్లో ఏపీ ప్రభుత్వంపై సెటైర్ వేశారు రామ్ (RGV comments on AP Govt) గోపాల్ వర్మ.
ఏపీ ప్రభుత్వంపై సెటైర్..
సినిమా నిర్మాతలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఎంతైతే టికెట్ ధర ఉండాలనుకుంటున్నారో దానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించేలా భగవంతుడు అనుగ్రహించాలని.. ఫ్లాప్‌ల కారణంగా పోగొట్టుకున్న డబ్బు కూడా తిరిగి వచ్చేలా చూస్తాడని ఆశాభావం వ్యక్తం (RGV on Small Cinema) చేశారు.
దేవుడిని నిందిస్తూనే..
ఇక చివరగా.. ఓ ట్వీట్లో దేవుడిపై మరో సెటైర్ వేశారు ఆర్జీవీ. అందరికీ హ్యాపీ సంక్రాంతి (Ram Gopal Varma Sankranti Wishes).. ఏ దేవుడైతే మనందరిని జబ్బుపడేలా చేస్తున్నాడో, ప్రణాలు తీస్తున్నాడో, ఆర్థికంగా నష్టపోయేలా చేస్తున్నాడో.. అదే దేవుడు మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం అందించాలని కోరుకుంటున్నట్లు (RGV satires on God) తెలిపారు.
Also read: Chaysam divorce: అయ్యో పాపం నందిని రెడ్డి.. చై-సామ్ విడాకులతో చిక్కులు!
Also read: Bangarraju Review: నాగార్జున- నాగచైతన్య బంగార్రాజు ఫైనల్ రివ్యూ.. ఎలా ఉందంటే.??
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook