The Kerala Story : `ది కేరళ స్టోరీ`పై వర్మ ట్వీట్.. అసలు సినిమా కథేంటంటే?
The Kerala Story Movie ది కేరళ స్టోరీ సినిమా ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా మీద అక్కడి ప్రభుత్వం కూడా నిషేదం విధించింది. కొన్ని చోట్ల మల్టీ ప్లెక్సుల్లోనూ బ్యాన్ నడుస్తోంది. అయితే ఈ సినిమా మెల్లిమెల్లిగా ఊపందుకుంటోంది. కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది.
The Kerala Story Movie దేశ వ్యాప్తంగా ఇప్పుడు ది కేరళ స్టోరీ సినిమా ట్రెండ్ అవుతోంది. కొన్ని చోట్ల బ్యాన్ కూడా విధించారు. మతకలహాలు రేకెత్తేలా సినిమా ఉందని కూడా పలు చోట్ల నిరసనలు వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ఆంక్షల మధ్య సినిమాను విడుదల చేశారు. అయితే ఈ సినిమా మౌత్ టాక్‌తో బాగానే నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎక్కడ షోలు వేసినా హౌస్ ఫుల్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే తాజాగా వర్మ ఈ సినిమా మీద వేసిన కామెంట్ వైరల్ అవుతోంది.
ఓ తమిళ, మలయాళి అమ్మాయి నటించింది.. నిర్మాత గుజరాతీ.. బెంగాళీ డైరెక్టర్.. హిందీ సినిమా.. అన్ని భాషల్లో ఇప్పుడు బ్లాక్ బస్టర్.. నిజమైన పాన్ ఇండియన్ సినిమా అంటూ వర్మ వేసిన ట్వీట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. వర్మ అసలే ఇలాంటి కాంట్రవర్సీ సినిమాల మీద ముందుగా రియాక్ట్ అవుతుంటాడు. ఇప్పుడు ది కేరళ స్టోరీ మీద వర్మ వేసిన ట్వీట్ రచ్చ రచ్చగా మారుతోంది.
అసలు ఈ కేరళ స్టోరీ ఏంటంటే.. హిందూ అమ్మాయిలను ముస్లిం అబ్బాయిలు ప్రేమ పేరుతో మతాన్ని మార్చడం, పెళ్లి చేసుకోవడం, ఆ తరువాత ఆఫ్ఘనిస్తాన్‌కు తీసుకెళ్లడం.. అక్కడ తీవ్రవాద సంస్థల్లో చేర్పించడం.. అనే పాయింట్ మీద సినిమాను తీశారు. ఇవన్నీ కూడా కేరళలో జరిగిన యదార్థ సంఘటనలే. ప్రతీ దానికి ఓ ఎవిడెన్స్, సాక్ష్యం ఉందని నిర్మాత చెప్పుకొచ్చాడు.
Also Read: Ananya Nagalla : అనన్య తడి అందాలు.. చూస్తే వామ్మో అనాల్సిందే.. అందరి ఫోకస్ అక్కడే
ఈ సినిమాను బ్యాన్ చేయాలని, థియేటర్లో వేయకూడదని, నిషేధించాలని కోర్టుల్లో కేసులు కూడా వేస్తున్నారు. అయితే ఈ సినిమా మాత్రం ఇప్పుడు జనాల్లోకి వెళ్లిపోయింది. మౌత్ టాక్‌తో సినిమా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తోంది. కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతూనే వస్తున్నాయి. చూస్తుంటే ఈ సినిమా మున్ముందు కొత్త రికార్డులు క్రియేట్ చేసేలానే కనిపిస్తోంది.
Also Read: Naga Chaitanya : పోతుందని తెలిసి కూడా ప్రమోషన్స్ చేయడం కష్టం!.. థాంక్యూపై నాగ చైతన్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook